Sreeja Konidela Husband Kalyan Dev Cryptic Post On Love Goes Viral - Sakshi
Sakshi News home page

Kalyan Dev: వైరల్‌గా మారిన చిరంజీవి చిన్నల్లుడి ఇన్‌స్టా పోస్ట్‌

Feb 4 2022 8:29 PM | Updated on Feb 5 2022 8:42 AM

Sreeja Konidela Husband Kalyan Dev Cryptic Post On Love Goes Viral - Sakshi

Sreeja Konidela Husband Kalyan Dev Cryptic Post : చిరంజీవి చిన్నల్లుడు, శ్రీజ భర్త కల్యాణ్‌ దేవ్‌ ఈమధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. రీసెంట్‌గా సూపర్‌ మచ్చీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇక సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఈ మధ్యే తన మేకోవర్‌ లుక్‌ని షేర్‌ చేసిన కల్యాణ్‌ దేవ్‌ దీనికి నీకు ఎవరైనా ఏదైనా చెబితే నువ్వు పెద్దగా పట్టించుకోకు. ఒక నవ్వు నవ్వి వదిలెయ్‌. నీకు నచ్చింది నువ్వు చెయ్‌ అంటూ కొటేషన్‌ను యాడ్‌ చేశాడు.

తాజాగా మరో ఫోటోను షేర్‌ చేసి దానికి ఇంట్రెస్టింగ్‌ క్యాప్షన్‌ ఇచ్చాడు. సముద్రపు అలల మధ్య ఉదయించిన సూర్యుడి ఫోటోను షేర్‌చేస్తూ.. ఎన్నో ఆశలతో ప్రేమగా, సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.  ప్రస్తుతం కల్యాణ్‌ దేవ్‌ షేర్‌ చేసిన ఈ పోస్ట్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement