'సరిపోదా శనివారం ట్రైలర్‌ ఈవెంట్' .. స్పెషల్‌ అట్రాక్షన్‌గా 70 ఏళ్ల బామ్మ! | Special Attraction In Hero Nani's Saripodhaa Sanivaaram Movie Trailer Event | Sakshi
Sakshi News home page

Saripodhaa Sanivaaram Movie: 'మనవడి కోసం వచ్చినందుకు థ్యాంక్స్'.. నాని స్పీచ్‌ వైరల్

Aug 13 2024 8:03 PM | Updated on Aug 13 2024 8:10 PM

Special Attraction In Hero Nani's Saripodhaa Sanivaaram Movie Trailer Event

హాయ్ నాన్న మూవీ తర్వాత నాని హీరోగా నటిస్తున్న తాజా పాన్‌ ఇండియా ఫిల్మ్‌ ‘సరిపోదా శనివారం’. వివేక్‌ ఆత్రేయ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ప్రియాంకా అరుల్‌ మోహన్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై డీవీవీ దానయ్య, కల్యాణ్‌ దాసరి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ఇంతకుముందెన్నడు కనిపించని పాత్రలో నాని నటిస్తున్నారు. తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా సరిపోదా శనివారం ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 70 ఏళ్ల భామ తన అభిమాన హీరో నాని చూసేందుకు వచ్చింది. ఆమెను గమనించిన హీరో నాని సంతోషం వ్యక్తం చేశారు. మీ మనవడిని ఆశీర్వదించడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అంటూ బామ్మను హీరో నాని పలకరించాడు. ఈ ఈవెంట్‌లో మీరు ఎంతో స్పెషల్ అని ఆయన అన్నారు.  అనంతరం అభిమానులతో సెల్ఫీ తీసుకున్నారు. కాగా.. ఈ మూవీ ఆగస్టు 29న రిలీజ్ కానుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement