దుబాయ్‌లో చిక్కుకుపోయా.. నన్ను భారత్‌కు తీసుకురండి! | Sonal Chauhan Stranded In Dubai, Seeks Help To Get Back Home, Post Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

Sonal Chauhan: మోదీగారు.. నన్ను క్షేమంగా భారత్‌కు తీసుకురండి

Mar 1 2026 11:06 AM | Updated on Mar 1 2026 11:55 AM

Sonal Chauhan stranded in Dubai, Seeks Help to Get Back Home’

ఇరాన్‌పై యుద్ధం నేపథ్యంలో ఇజ్రాయెల్‌, బహ్రెయిన్‌, ఖతర్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లలో ఉన్న భారతదేశ ప్రజలు బిక్కుబిక్కుమంటూ భయం గుప్పిట్లో బతుకుతున్నారు. దుబాయ్‌లో టాలీవుడ్‌ హీరో మంచు విష్ణుతో పాటు బాలీవుడ్‌ నటి సోనాల్‌ చౌహాన్‌ కూడా చిక్కుకుపోయింది. విమాన రాకపోకలు నిలిపివేయడంతో తిరిగొచ్చే దారి కనిపించడం లేదని సోషల్‌ మీడియాలో వాపోయింది.

సాయం చేయండి
గౌరవనీయులైన ప్రధాని నరేంద్ర మోదీగారు.. ప్రస్తుత సంక్షభ పరిస్థితుల్లో నేను దుబాయ్‌లో చిక్కుకున్నాను. విమానాల రాకపోకలు ఆగిపోయాయి. ఇండియాకు ఎలా రావాలో తెలియడం లేదు. నేను సురక్షితంగా ఇంటికి చేరేందుకు ప్రభుత్వం సాయం చేయాలని కోరుతున్నాను అంటూ చేతులు జోడించి నమస్కరిస్తున్న ఎమోజీని జత చేసింది సోనాల్‌.

సినిమా
సోనాల్‌ చౌహాన్‌ మోడల్‌, సింగర్‌, హీరోయిన్‌. జన్నత్‌ చిత్రంతో హిందీలో, రెయిన్‌బో మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. లెజెండ్‌, పండగ చేస్కో, షేర్‌, సైజ్‌ జీరో, డిక్టేటర్‌, ఎఫ్‌ 3, ద ఘోస్ట్‌ వంటి చిత్రాల్లో నటించింది. తెలుగులో చివరగా ఆదిపురుష్‌ మూవీలో మండోదరిగా యాక్ట్‌ చేసింది. చివరగా దర్ద్‌ (2024) అనే ద్విభాషా చిత్రంలో తళుక్కుమని మెరిసింది.

చదవండి: తల్లి జీవితం ఇలాగే ఉంటుంది: ఇషితా దత్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement