'కల్కి'లో ఈ తెలుగు హీరోయిన్ కూడా! మీరు గమనించారా? | Sobhita Dhulipala In Kalki 2898 Movie Find It Where | Sakshi
Sakshi News home page

Kalki sobitha: మూవీలో చాలామంది స్టార్స్.. వాళ్లతో పాటు ఈమె కూడా!

Jun 30 2024 3:49 PM | Updated on Jun 30 2024 3:55 PM

Sobhita Dhulipala In Kalki 2898 Movie Find It Where

'కల్కి 2898' మూవీ బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతోంది. మూడు రోజుల్లో రూ.415 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు నమోదు చేసింది. సినిమాలో లీడ్ రోల్స్ చేసిన వాళ్లు నలుగురైతే.. అతిథి పాత్రల్లో మాత్రం లెక్కలేనంత మంది కనిపించారు. వీళ్లందరితో పాటు మరో తెలుగు హీరోయిన్ శోభిత కూడా ఇందులో భాగమైందనే విషయం మీకు తెలుసా? మరి మీరు ఏమైనా గమనించారా? ఇంతకీ ఎక్కడ ఉందో తెలుసా?

(ఇదీ చదవండి: Kalki 2898 AD: అర్జునుడుగా విజయ్‌ దేవరకొండ.. రెమ్యునరేషన్‌ ఎంతంటే?)

'కల్కి'లో ప్రభాస్, అమితాబ్, దీపిక, కమల్ హాసన్ ప్రధాన పాత్రలు పోషిస్తే.. విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్, ఆర్జీవీ, రాజమౌళి, అనుదీప్, ఫరియా అబ్దుల్లా ఇలా బోలెడు మంది స్టార్స్ అలా వచ్చి ఇలా వెళ్లిపోయే పాత్రల్లో కనిపించారు. వీళ్లతో పాటే నాగచైతన్య రూమర్ గర్ల్ ఫ్రెండ్, హీరోయిన్ శోభిత కూడా ఈ మూవీలో భాగమేనట. దీపికా పదుకొణె పాత్రకు తెలుగులో ఈమెనే డబ్బింగ్ చెప్పిందట.

తొలుత తన పాత్ర కోసం దీపికనే డబ్బింగ్ చెప్పుకొంది. ట్రైలర్‌లోనూ ఆమె గొంతు వినిపించింది. కాకపోతే ఆ డబ్బింగ్ చూసి విమర్శలు వచ్చాయి. దీంతో మూవీలో దీపిక పాత్రకు శోభితతో డబ్బింగ్ చెప్పించారట. అలా 'కల్కి'లో కూడా శోభిత కూడా భాగమైందని అంటున్నారు. ఇదిలా ఉండగా శోభిత-నాగచైతన్య రిలేషన్ గురించి గత కొన్నాళ్ల నుంచి రూమర్స్ వస్తున్నాయి. దీనిపై ఓ క్లారిటీ వస్తే గానీ నెటిజన్లు ఊరుకునేలా లేరు!

(ఇదీ చదవండి: ప్రభాస్ కల్కి.. వర్షంలో బుజ్జి కోసం బారులు తీరిన ఫ్యాన్స్‌!)

Advertisement
 
Advertisement
Advertisement