స్టార్ హీరోను కలిసిన సీఎం.. | Shiva Rajkumar returns home after successful cancer surgery in US | Sakshi
Sakshi News home page

Shiva Rajkumar: శివరాజ్ కుమార్‌ను కలిసిన సీఎం.. ఆరోగ్య పరిస్థితిపై ఆరా

Jan 27 2025 5:00 PM | Updated on Jan 27 2025 6:56 PM

Shiva Rajkumar returns home after successful cancer surgery in US

శాండల్‌వుడ్‌ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్‌ వెద్య చికిత్స కోసం గతేడాది డిసెంబర్‌లో అమెరికా వెళ్లారు. ప్రముఖ మియామీ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్‌లో ఆయన చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు. త్వరలోనే మీ అందరినీ కలుస్తానని శివరాజ్ కుమార్ తన భార్యతో కలిసి ఓ వీడియో సందేశం రిలీజ్ చేశారు.

తాజాగా శివరాజ్ కుమార్‌ జనవరి 26న బెంగళూరు చేరుకున్నారు. క్యాన్సర్‌ నుంచి ఆయన పూర్తిగా కోలుకుని స్వదేశానికి తిరిగొచ్చారు. దీంతో ఆయనను చూసేందుకు వేలాదిమంది అభిమానులు తరలివచ్చారు. ఈ సందర్భంగా తన వైద్య చికిత్స గురించి అభిమానులతో మాట్లాడారు. నా అభిమానులు, శ్రేయోభిలాషుల ప్రేమ, మద్దతు వల్లే తాను కోలుకున్నానని అన్నారు. మళ్లీ మీ అందరి సినిమాలతో అలరించేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని శివరాజ్ కుమార్‌ తెలిపారు. దాదాపు ఆరుగంటలపాటు తనకు శస్త్ర చికిత్స జరిగిందని..రెండో రోజు నుంచే నడవడం ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ ప్రయాణంలో నా భార్య, కూతురు తనకు అండగా నిలిచారని అన్నారు.


కాగా.. శివ రాజ్‌కుమార్ చివరిగా కన్నడ చిత్రం భైరతి రణగల్‌లో కనిపించారు. ఈ సినిమా గతేడాది నవంబర్ 15, 2024న థియేటర్లలో విడుదలైంది. ప్రస్తుతం ఉత్తరకాండ, 45, భైరవనా కోనే పాటతో సహా పలు చిత్రాలలో పని చేయనున్నారు. అంతేకాకుండా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన చిత్రం ఆర్సీ 16లోనూ శివరాజ్ కుమార్‌ కీలక పాత్రలో కనిపించనున్నారు.

cm

శివరాజ్‌ కుమార్‌ను కలిసిన సీఎం..

శివరాజ్‌ కుమార్‌ను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కలిశారు. ఆయన నివాసానికి వెళ్లిన ముఖ్యమంత్రి ఆరోగ్యం, చికిత్సపై ఆరా తీశారు. 

Advertisement
 
Advertisement
Advertisement