Shaakuntalam Movie First Day Box Office Collection - Sakshi
Sakshi News home page

Shaakuntalam Box Office Collection: ‘శాకుంతలం’ఫస్ట్‌ డే కలెక్షన్స్‌.. అన్ని కోట్లేనా?

Apr 15 2023 2:10 PM | Updated on Apr 15 2023 2:21 PM

Shaakuntalam Movie First Day BOx Office Collection - Sakshi

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘శాకుంతలం’. గుణశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో దుష్యంతుడిగా మలయాళ నటుడు దేవ్‌ మోహన్‌.. భరతుడిగా అల్లు అర్జున్‌ ముద్దుల తనయ అర్హ నటించారు. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 14)విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించింది.  వీఎఫ్ఎక్స్ విషయంలో ఆడియన్స్ నిరాశకు గురయ్యారు. ఫలితంగా తొలి రోజు  ఈ చిత్రం ఊహించినదానికంటే చాలా తక్కువ కలెక్షన్స్‌ని రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా తొలిరోజు రూ. 4.70 కోట్ల గ్రాస్‌, రూ. 2.24 కోట్ల షేర్‌ వసూళ్లను రాబట్టినట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలలో రూ.2 కోట్ల వరకు గ్రాస్‌ కలెక్షన్స్‌ని రాబట్టింది.  

(చదవండి: ‘శాకుంతలం’ మూవీ రివ్యూ)

ఏరియా వైజ్‌గా చూస్తే.. నైజాంలో రూ. 52 లక్షలు, సీడెడ్‌ రూ.10 లక్షలు, ఉత్తరాంధ్ర రూ. 15 లక్షలు, ఈస్ట్‌ గోదావరి రూ.8లక్షలు, వెస్ట్‌ గోదావరి రూ.4 లక్షలు, గుంటూరు రూ. 8 లక్షలు, కృష్ణ రూ. 8లక్షలు, నెల్లూరు రూ. 3లక్షలు చొప్పున వసూళ్లను రాబట్టింది.  తమిళ్‌, కర్ణాటక, ఇతల ప్రాంతాలలో కలిసి రూ. 42 లక్షల కలెక్షన్స్‌ రాబట్టినట్లు ట్రేడ్‌ వర్గాల వెల్లడిస్తున్నాయి. ఈ వీకెండ్‌లో కలెక్షన్స్‌ కాస్త పెరిగే అవకాశం ఉంది.

రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా 18 కోట్ల రేంజ్ లో ఫ్రీ రిలీజ్ బిజినెస్ అయినట్లు తెలుస్తుంది. రూ.19 కోట్ల టార్గెట్ తో మార్కెట్లోకి వచ్చిన ఈ సినిమాకు ఫస్ట్‌ డే రూ 2.24 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చింది. అంటే ఈ సినిమా సేఫ్‌ జోన్‌లోకి వెళ్లాలంటే.. ఇంకా రూ. 16.76 కోట్ల వరకు షేర్ కలెక్షన్స్ అందుకోవాల్సి ఉంటుంది. మరి సినిమా అనుకున్న టార్గెట్ ను ఎన్ని రోజుల్లో ఫినిష్ చేస్తుందో చూడాలి.

Advertisement
 
Advertisement
Advertisement