హీరోయిన్లు ఎప్పటికీ ఫ్రెండ్స్‌ కాలేరన్నది నిజం: సిమ్రాన్‌ | Senior Actress Simran Breaks Her Silence On Remarks About Her Aunt Roles And Dabba Roles | Sakshi
Sakshi News home page

Simran: ఆంటీ పాత్రలు నాకిష్టమే.. ఆమె సెటైర్లతో నాకు బాగా తెలిసొచ్చింది

Apr 26 2025 7:37 PM | Updated on Apr 26 2025 7:43 PM

Senior Actress Simran Breaks Her Silence On Remarks About Her Aunt Roles And Dabba Roles

రెండు కొప్పులు ఒకచోట ఇమడవు అంటుంటారు. అది నిజమే అంటోంది హీరోయిన్‌ సిమ్రాన్‌ (Simran). ఈమె ఇటీవలే గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ సినిమాలో అతిథి పాత్రలో నటించింది. సినిమా రిలీజయ్యాక జరిగిన ఓ అవార్డు ఫంక్షన్‌లో తనకు ఎదురైన ఓ చేదు అనుభవాన్ని బయటపెట్టింది. నేను ఆంటీ రోల్స్‌ చేస్తున్నానని ఓ నటి ఎగతాళి చేసిందని తెలిపింది. పనికిమాలిన డబ్బా పాత్రల్లో నటించడం కంటే అమ్మ, ఆంటీ రోల్స్‌ చేయడం ఎంతో ఉత్తమం అని స్టేజీపైనే నటికి కౌంటర్‌ ఇచ్చింది.

లైలా? జ్యోతిక? ఎవరన్నారు?
లైలా గురించే సిమ్రాన్‌ ఈ కామెంట్స్‌ చేసిందన్న ప్రచారం జరిగింది. మరికొందరేమో డబ్బా అన్న పదం వాడిందంటే డబ్బా కార్టెల్‌ సిరీస్‌లో నటించిన జ్యోతికపై ఈ వ్యాఖ్యలు చేసిందేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. తాజాగా సిమ్రాన్‌ ఓ ఇంటర్వ్యూలో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ఆమె మాటల వల్ల నాకు నిజంగా బాధేసింది. అందుకే నా బాధను చెప్పుకున్నాను. కెరీర్‌ ఆరంభం నుంచే నేను ఆంటీ పాత్రలు చేస్తున్నాను. 

ఆంటీ అనే పదం ఇష్టం
ఆంటీ అనే పదాన్ని అవమానంగా ఫీలవను.. ఇష్టంగానే భావిస్తాను. ఆ పాత్రలు చేయడం తప్పేం కాదు. ఇదంతా జరిగాక నాకో విషయం అర్థమైంది. సినీ ఇండస్ట్రీలో హీరోయిన్లెప్పుడూ ఫ్రెండ్స్‌ కాలేరని రుజువైంది. ఫ్రెండ్‌ అనుకున్నవాళ్లే మనపై అలాంటి కామెంట్లు చేస్తే మనసుకు బాధగా అనిపిస్తుంది. ఆమె తర్వాతిరోజు క్యాజువల్‌గానే మాట్లాడింది. కానీ మా స్నేహం మునుపటిలా మాత్రం కొనసాగదు అని సిమ్రాన్‌ చెప్పుకొచ్చింది. కానీ తనపై సెటైర్లు వేసిందెవరన్నది మాత్రం సిమ్రాన్‌ వెల్లడించలేదు.

చదవండి: తాగుడు అలవాటు.. ఎంత చెప్పినా మానలేదు.. అందుకే విడాకులు

Advertisement
 
Advertisement
Advertisement