త‌మిళ న‌టుడికి క‌రోనా పాజిటివ్‌ | Sarathkumar Tests Coronavirus Positive | Sakshi
Sakshi News home page

క‌రోనా బారిన‌ శ‌ర‌త్‌కుమార్‌

Dec 8 2020 8:34 PM | Updated on Dec 8 2020 8:34 PM

Sarathkumar Tests Coronavirus Positive - Sakshi

త‌మిళ‌ న‌టుడు, రాజ‌కీయ నాయ‌కుడు శ‌ర‌త్‌కుమార్‌కు క‌రోనా సోకిన‌ట్లు తేలింది. ఈ విష‌యాన్ని ఆయ‌న భార్య, న‌టి రాధిక సోష‌ల్ మీడియాలో అధికారికంగా వెల్ల‌డించారు. ల‌క్ష‌ణాలేవీ లేకుండానే పాజిటివ్‌గా నిర్ధార‌ణ అయింద‌న్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న హైద‌రాబాద్‌లోని ప్రైవేటు ఆస్ప‌త్రిలో చికిత్స తీసుకుంటున్న‌ట్లు పేర్కొన్నారు. త్వ‌ర‌లోనే ఆయ‌న పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాల‌ని కోరుతూ కూతురు వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్  ట్వీట్ చేశారు. (చ‌ద‌వండి: థియేటర్లలో చంపడానికి రాబోతుంది: ఆర్జీవీ)

కాగా శ‌ర‌త్ ప్ర‌స్తుతం "పొన్నియిన్ సెల్వ‌న్" చిత్రంలో కీల‌క పాత్ర పోషిస్తున్నారు. అలాగే జీవీ ప్ర‌కాశ్ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టిస్తున్న 'ఆడంగ‌త్తె' సినిమాలోనూ ఓ ముఖ్య పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఇక ఆయ‌న కూతురు వ‌ర‌ల‌క్ష్మి విష‌యానికి వ‌స్తే.. ప‌లు సినిమాల్లో న‌టించిన ఆమె 'క‌న్నామూచ్చి' అనే త‌మిళ సినిమాతో ద‌ర్శ‌కురాలిగా మార‌బోతున్నారు. క‌న్నామూచ్చి అంటే తెలుగు దాగుడుమూత‌లు అని అర్థం. అలాగే తెలుసులో రవితేజ ‘క్రాక్‌’, అల్లరి నరేశ్‌ ‘నాంది’ సినిమాల్లో నటిస్తున్నారు. (చ‌ద‌వండి: ఒకరికొకరు నిలబడదాం: వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్)

Advertisement
 
Advertisement
Advertisement