Samantha Emotional Post About Her Fitness Trainer Junaid Shaikh, Goes Viral - Sakshi
Sakshi News home page

Samantha: నా కన్నీళ్లు, స్టెరాయిడ్‌ థెరపీలు.. అన్నీ చూశావు, నా వెంటే ఉన్నావు..

Nov 12 2022 6:49 PM | Updated on Nov 12 2022 7:56 PM

Samantha Emotional Post About Her Fitness Trainer Junaid Shaikh - Sakshi

గత కొన్ని నెలలుగా నా వెన్నంటి నిలబడినవారిలో నువ్వూ ఒకరివి. నిరాశగా, బలహీనంగా ఉన్నప్పుడు, కన్నీళ్లు పెట్టుకున్న సమయాల్లో, హై డోస్‌ స్టెరాయిడ్‌ ధెరపీ చేయించుకున్నప్పుడు కూడా నా వెంటే ఉన్నావు.

హీరోయిన్‌ సమంత నటించిన లేటెస్ట్‌ మూవీ యశోద. ఈ మూవీలో సామ్‌ అమాయకంగా కనిపిస్తూనే యాక్షన్‌ సీన్స్‌లో అదరగొట్టిందంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో యాక్షన్‌ సన్నివేశాల్లో నటించేందుకు సహకరించిన తన ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ జునైద్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పింది సామ్‌. ఈ మేరకు సోషల్‌ మీడియాలో భావోద్వేగ పోస్ట్‌ షేర్‌ చేసింది.

'నాకిష్టమైన జిలేబీ తినడానికి జునైద్‌ ఎప్పుడూ ఒప్పుకోలేదు. కానీ యశోద విజయాన్ని, మరీ ముఖ్యంగా యాక్షన్‌ సన్నివేశాలను సెలబ్రేట్‌ చేసుకోవడానికి ఈరోజు జిలేబీ తీసుకొచ్చాడు. గత కొన్ని నెలలుగా నా వెన్నంటి నిలబడినవారిలో నువ్వూ ఒకరివి. నిరాశగా, బలహీనంగా ఉన్నప్పుడు, కన్నీళ్లు పెట్టుకున్న సమయాల్లో, హై డోస్‌ స్టెరాయిడ్‌ ధెరపీ చేయించుకున్నప్పుడు కూడా నా వెంటే ఉన్నావు. నాతో వర్కవుట్లు చేయించావు. నువ్వు నన్ను గివప్‌ చేయనివ్వలేదు, ఎప్పటికీ గివప్‌ చేయనివ్వవు కూడా! నీవల్లే ఇలా మారాను. థాంక్యూ' అని రాసుకొచ్చింది. ఈ పోస్టుకు ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ ఆప్యాయంగా హత్తుకున్న ఫొటోతో పాటు ఓ వీడియో షేర్‌​ చేసింది. ఇందులో సమంత చేతికి సెలైన్‌ స్ట్రిప్‌ ఉన్నప్పటికీ జిమ్‌లో వర్కవుట్‌ చేస్తుండటం గమనార్హం.

చదవండి: 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement