కౌంట్‌ డౌన్‌ మొదలుపెట్టిన వెంకీమామ | Saindhav poster release | Sakshi
Sakshi News home page

కౌంట్‌ డౌన్‌ మొదలుపెట్టిన వెంకీమామ

Oct 31 2023 4:31 AM | Updated on Oct 31 2023 6:48 PM

Saindhav poster release - Sakshi

వెంకటేశ్‌ హీరోగా శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘సైంధవ్‌’. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, బేబీ సారా, జయప్రకాశ్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. నిహారిక ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై వెంకట్‌ బోయనపల్లి నిర్మిస్తున్న ‘సైంధవ్‌’ జనవరి 13న సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. కాగా ఇది  వెంకటేశ్‌ కెరీర్‌లో 75వ చిత్రం కావడం విశేషం. తాజాగా ‘సైంధవ్‌’ విడుదలకు కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ చేస్తూ మేకర్స్‌ ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేశారు.

‘‘పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోన్న చిత్రం ‘సైంధవ్‌’. సినిమా విడుదలకు ఇంకా 75 రోజులు ఉంది. సంతోష్‌ నారాయణన్‌ ఈ చిత్రం కోసం అద్భుతమైన ఆల్బమ్‌ సిద్ధం చేశారు. త్వరలో మ్యూజికల్‌ ప్రమోషన్్స స్టార్ట్‌ చేయబోతున్నాం’’ అని మేకర్స్‌ అన్నారు. ఈ చిత్రానికి సహనిర్మాత: కిశోర్‌ తాళ్లూరు, కెమెరా: యస్‌. మణికందన్, ఎగ్జిక్యూటివ్‌ ్ర΄÷డ్యూసర్‌: ఎస్‌. వెంకటరత్నం (వెంకట్‌).

Advertisement
 
Advertisement
Advertisement