సాయి పల్లవి ప్రయోగం.. కమెడియన్‌తో రొమాన్స్‌! | Sakshi
Sakshi News home page

సాయి పల్లవి ప్రయోగం.. కమెడియన్‌తో రొమాన్స్‌!

Published Sat, Jan 30 2021 8:17 PM

Sai Pallavi Next Movie With Kaali Venkat - Sakshi

తన డాన్స్‌తో, నటనతో ప్రేక్షకులను ఫిదా చేసిన  హీరోయిన్ సాయి పల్లవి. మలయాళ చిత్రం ప్రేమమ్‌ ద్వారా కథానాయికగా పరిచయమైన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే దక్షిణాదిన స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. టాలీవుడ్‌లో ఆమెకు ఉన్న క్రేజీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘ఫిదా’మూవీతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. ప్రస్తుత ఈ నాచురల్‌ బ్యూటీ నాగచైతన్యతో ‘లవ్‌స్టోరీ’, రానాతో ‘విరాటపర్వం’సినిమాల్లో నటిస్తుంది. అలాగే పవన్‌ కల్యాణ్‌తో ‘అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్‌` రీమేక్‌లోనూ న‌టించ‌బోతోంది.

ఇంత బిజీగా ఉన్న ఈ అమ్మడు.. త్వరలో ఓ ప్రయోగానికి సిద్దమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ హాస్యనటుడు కాళి వెంకట్‌ హీరోగా చిత్రం తెరక్కెనున్నట్లు కోలీవుడ్‌ కోడై కూస్తోంది. ఈ మేరకు చిత్రబృందం సాయి పల్లవిని సంప్రదించారట. సాయి పల్లవి ఒప్పుకోవడమే ఆలస్యం అని తెలుస్తుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఒప్పుకుంటే గనక కొత్త చరిత్ర సృష్టించినట్లు అవుతుంది. స్టార్ హీరోయిన్ గా ఉంటూ సపోర్టింగ్ యాక్టర్ పక్కన నటించడం అంటే చిన్న విషయం కాదు. మరి సాయి పల్లవి ఒప్పుకుంటుందో లేదో చూడాలి.

Advertisement

తప్పక చదవండి

Advertisement