RRR Movie: ఆ పాట సూడు, ఆ ఆట సూడు.. నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ చూడు..

RRR Movie: Naatu Naatu Full Video Song Released - Sakshi

ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూసిన ఎంతోమందికి నాటు నాటు సాంగ్ ఫేవరెట్‌ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఊరనాటుగా సాగే ఈ పాటలో ఎన్టీఆర్‌, చరణ్‌ల స్టెప్పులు వీరనాటుగా ఉంటాయి. తారక్‌, చెర్రీల హుక్‌ స్టెప్పుకు థియేటర్స్‌లో ఈలలు వేయని ప్రేక్షకులు లేరంటే అతిశయోక్తి కాదు. సినిమా ప్రమోషన్స్‌లోనూ ఆమిర్‌ ఖాన్‌, సల్మాన్‌ ఖాన్‌, అనిల్‌ రావిపూడి, రాజమౌళి వంటి పలువురు సెలబ్రిటీలు ఈ పాటకు స్టెప్పులేసి అలరించారు.

అంతలా సోషల్‌ మీడియాను ఓ ఊపు ఊపిన ఈ సాంగ్‌ లవర్స్‌ కోసం ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. సోమవారం సాయంత్రం నాటు నాటు ఫుల్‌ వీడియో సాంగ్‌ను వదిలింది. ఈ పాటను కాలభైరవ, రాహుల్‌ సిప్లిగంజ్‌ ఆలపించారు. కీరవాణి సంగీతం అందించారు. కాగా రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు.

చదవండి: గత 20 ఏళ్లుగా ఎన్టీఆర్‌ అభిమానిని: కేజీఎఫ్‌ డైరెక్టర్‌

కిరాక్‌ ఆర్‌పీ ఇల్లు చూశారా? లిఫ్ట్‌, హోమ్‌ థియేటర్‌.. అబ్బో ఇలా చాలానే ఉన్నాయి!

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top