నా రెండో పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకు?.. రేణు దేశాయ్ ఆగ్రహం | Renu Desai Responds On Her Second Marriage News In Social Media | Sakshi
Sakshi News home page

Renu Desai: నా రెండో పెళ్లిపై అంత ఆసక్తి ఎందుకు?.. రేణు దేశాయ్

Apr 11 2025 7:10 PM | Updated on Apr 11 2025 9:06 PM

Renu Desai Responds On Her Second Marriage News In Social Media

పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్.. తనపై వస్తున్న వార్తలపై స్పందించారు. తన రెండో పెళ్లిపై మీకు ఎంత ఆసక్తి అని ప్రశ్నించారు. ఇలాంటి వార్తలతో సమాజానికి ఏమైనా ఉపయోగం ఉందా? అని రేణు దేశాయ్ నిలదీశారు. సోషల్ మీడియాలో తన రెండో పెళ్లిపై వస్తున్న వార్తలపై ఆమె మండిపడ్డారు.

కాగా.. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లి గురించి రేణు దేశాయ్ మాట్లాడారు. దీంతో పాటు పలు అంశాలపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. రాజకీయాల్లోకి రావడంపై కూడా క్లారిటీ ఇచ్చారు. అలాగే సమాజంలో జరుగుతున్న పలు విషయాలపై కూజా మాట్లాడారు. ఇవన్నీ వదిలేసి కేవలం తన రెండో పెళ్లినే ఎందుకు హైలెట్ చేస్తున్నారంటూ రేణు దేశాయ్ ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని తన ఇన్‌స్టా వేదికగా పోస్ట్‌ చేశారు.

రేణు దేశాయ్ సోషల్ మీడియాలో రాస్తూ..' మీడియా వాళ్లు నా రెండో పెళ్లి గురించి ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉన్నారని నాకు అర్థమైంది. నేను గంటకు పైగా మాట్లాడిన పాడ్‌కాస్ట్‌లో మన సమాజానికి ఉపయోగమైన  చాలా ముఖ్యమైన విషయాలు మాట్లాడా. కానీ వాటిని గురించి చర్చ చేయరు. సమస్యల కంటే నా రెండో పెళ్లికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నేను మీ అందరినీ కోరుకునేది ఒక్కటే.. దయ చేసి ఈ 44 ఏళ్ల మహిళ వివాహం గురించి మీ దృష్టిని మరల్చండి'అని పోస్ట్ చేశారు. 

Advertisement
 
Advertisement
Advertisement