Ram Charan and His Wife Upasana Are Vacation in Tanzania - Sakshi
Sakshi News home page

Ram Charan Vacation: వ్యాకేషన్‌లో ఆర్ఆర్ఆర్ హీరో.. సోషల్ మీడియాలో వీడియో వైరల్

Oct 30 2022 12:59 PM | Updated on Oct 30 2022 1:13 PM

Ram Charan and His Wife Upasana Are Vacation in Tanzania - Sakshi

ఇటీవల టాలీవుడ్ నటులు ఎక్కువగా వ్యాకేషన్‌లో కనిపిస్తున్నారు. షూటింగ్‌లతో ఎప్పుడు బిజీగా ఉండే హీరోలు కాస్త ఫ్రీ టైం దొరికితే విదేశాలకు చెక్కెస్తున్నారు. ఇటీవలే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా మాల్దీవులకు వెళ్లి రాగా.. టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు సైతం లండన్‌లో వ్యాకేషన్ ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ హీరో రామ్ చరణ్ సైతం చేరిపోయారు. ప్రస్తుతం ఆయన ఫ్యామిలీతో కలిసి హాలిడే ట్రిప్‌లో ఉన్నారు. జపాన్‌లో ఆర్ఆర్ఆర్ మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్న స్టార్ హీరో ఒక్కసారిగా  టాంజానియాలో సందడి చేస్తూ కనిపించారు.

(చదవండి: జపాన్‌లో రామ్ చరణ్ వీరాభిమాని.. ఆమె ప్రతిభకు చెర్రీ ఫిదా)

ఆయన సతీమణి ఉపాసనతో కలిసి టాంజానియాలో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రామ్ చరణ్ తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. అది కాస్తా సోషల్ మీడియాలో వైరలవుతోంది.  టాంజానియాలోని ఓ జూలో జీప్ నడుపుతున్న వీడియో క్లిప్‌ను పోస్ట్ చేశాడు. అక్కడే స్థానికులతో కలిసి రామ్ చరణ్ వంట చేస్తూ సందడి చేశారు. అనంతరం తన కెమెరాతో అక్కడి వన్యప్రాణుల చిత్రాలను కూడా బంధించారు. ఈ మెగా హీరో 'పేరులేని ఆఫ్రికా' అంటూ పోస్ట్‌కు క్యాప్షన్ కూడా ఇచ్చాడు. నల్లటి టీ-షర్టు, నీలిరంగు జాకెట్ ధరించిన చెర్రీ కొత్త లుక్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement