లారెన్స్‌కు జోడీగా మృణాల్.. మూవీ టైటిల్ కూడా డిఫరెంట్!? | Sakshi
Sakshi News home page

లారెన్స్‌కు జోడీగా మృణాల్.. మూవీ టైటిల్ కూడా డిఫరెంట్!?

Published Mon, Jan 1 2024 3:18 AM

Raghava Lawrence Upcoming Movie update - Sakshi

హీరో రాఘవా లారెన్స్, హీరోయిన్‌ మృణాళ్‌ ఠాకూర్‌ జోడీ కట్టనున్నారా? అంటే అవుననే అంటున్నాయి ఫిల్మ్‌నగర్‌ వర్గాలు. రాఘవా లారెన్స్‌ హీరోగా రమేష్‌ వర్మ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ ఫిల్మ్‌ తెరకెక్కనుందనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌ప్రారంభం కానుందని టాక్‌.

ఈ చిత్రంలో లారెన్స్‌కు జోడీగా మృణాళ్‌ కనిపిస్తారనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో లేటెస్ట్‌గా వినిపిస్తోంది. అలాగే ఈ సినిమాకు ‘శ్రీరామరక్ష’ అనే టైటిల్‌ను కూడా అనుకుంటున్నారట మేకర్స్‌. కాగా ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement
 
Advertisement