తేజ సజ్జతో జతకట్టిన ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ | Priya Prakash Varrier And Teja Sajja Ishq Movie First Look Release | Sakshi
Sakshi News home page

తేజ సజ్జతో జతకట్టిన ప్రియా ప్రకాశ్‌ వారియర్‌

Mar 5 2021 1:23 PM | Updated on Mar 5 2021 3:59 PM

Priya Prakash Varrier And Teja Sajja Ishq Movie First Look Release - Sakshi

‘మీరు లవ్‌‌స్టోరీ సినిమాలు చూసి విసిగిపోయారా.. అయితే మీ కోసం ఇష్క్‌ మూవీని తీసుకురాబోతున్నాం. అయితే ఇది లవ్‌స్టోరీ కాదు’ అటూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది ప్రియా

మలయాళీ కుట్టి,  క‌న్ను గీటు భామ్మ ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ తెలుగులో తొలిసారిగా నటించిన చిత్రం ‘చెక్’‌. హీరో నితిన్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, ప్రియా ప్రకాశ్‌లు లీడ్‌ రోల్‌లో నటించిన ఈ మూవీ ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ప్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది. అయినప్పటికి ప్రియా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. వెంటనే మెగా సూపర్ గుడ్ ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో నటించే చాన్స్‌ కోట్టేసింది ప్రియా. దర్శకుడు ఎస్‌ఎస్‌ రాజు తెరకెక్కిస్తున్న ఈ మూవీకి ‘ఇష్క్‌’ అనే టైటిల్‌ను ఖారారు చేశారు. తాజాగా ఈ మూవీకి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను‌ ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. 

‘మీరు లవ్‌‌స్టోరీ సినిమాలు చూసి విసిగిపోయారా.. అయితే మీ కోసం ఇష్క్‌ మూవీని తీసుకురాబోతున్నాం. అయితే ఇది లవ్‌స్టోరీ కాదు’ అటూ ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసింది ప్రియా. ఇందులో ఆమె ‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా పరిచయం అయిన తేజ సజ్జ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. ‘ఇష్క్‌.. నాట్ ఏ ల‌వ్ స్టోరీ’ అనే టైటిట్‌తో ఉన్న ఈ పోస్టర్‌లో ‌తేజ సీరియ‌స్ లుక్‌లో కనిపిస్తుంటే, ప్రియా ప్ర‌కాశ్ న‌వ్వుతూ క‌నిపిస్తుంది. వారి ముందు ప‌గిలిన అద్దాల ముక్కలు గాల్లో ఎగురుతున్నట్లు ఉన్నాయి. ఎన్వీ ప్రసాద్, పరాస్ జైన్, వకాడ అంజన్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి మహతి స్వరా సాగర్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement