Prabhas Project K Movie Team Calls For Stunt Crew Auditions - Sakshi
Sakshi News home page

Project K Stunt Crew Call: ప్రభాస్‌ సినిమాలో ఛాన్స్‌, డోంట్‌ మిస్‌, అనౌన్స్‌ చేసిన మేకర్స్‌

Apr 22 2022 4:33 PM | Updated on Apr 22 2022 6:40 PM

Prabhas Project K Team Hunts For Stunt Crew Auditions - Sakshi

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం వరుస సినిమాలను పట్టాలెక్కిస్తున్నాడు. ఇటీవలె రాధేశ్యామ్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్‌ చేతిలో ఇప్పుడు వరుస ప్రాజెక్టులు ఉన్నాయి. ఆది పురుష్‌, సలార్‌ షూటింగులతో బిజీగా ఉన్న ప్రభాస్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రాజెక్ట్‌ కే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుంది.

భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎక్కువగా కొత్తవారికి ఛాన్స్‌ ఇచ్చేందుకు మూవీ యూనిట్‌ ప్లాన్‌ చేస్తోంది. ఇందులో భాగంగానే ఇప్పటికే పలుమార్లు క్యాస్ట్ కాలింగ్ అంటూ ఆడిషన్స్‌కు పిలుపునిచ్చిన ప్రాజెక్ట్ కే.. తాజాగా మరోసారి టాలెంట్‌ ఉన్న వారిని తమ సినిమాలో నటించేందుకు అవకాశం కల్పించింది.

మార్షల్ ఆర్ట్స్‌లో టాలెంట్ ఉన్నవారు, పార్కౌట్ ప్లేయ‌ర్స్, న్యూ ఏజ్ యాక్ష‌న్ కొరియోగ్రాఫ‌ర్స్ ఉంటే టీంను సంప్రదించాలను కోరుతూ ట్వీట్ చేసింది.  ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement