బాహుబ‌లి వచ్చి ఆరేళ్లు.. ఆసక్తికరమైన పోస్ట్‌ చేసిన ప్రభాస్‌

Prabhas Celebrates Six Years Baahubali Cinema And Post In Twitter - Sakshi

వెండితెరపై సినిమాలు ఎన్నో వస్తుంటాయ్‌ పోతుంటాయ్‌. అందులో పరాజయాలు, హిట్లు, బ్లాక్‌బస్టర్లు ,ఇండస్ట్రీ హిట్లు ఉంటాయ్‌ కానీ కొన్ని సినిమాలు మాత్రం చరిత్రలో అలా మిగిలిపోతాయి. అలాంటి చిత్రమే దర్శకధీరుడు ఎస్‌ ఎస్‌ రాజమౌళి తెరకెక్కించిన విజువల్‌ వండర్‌ ‘బాహాబలి’. ఈ చిత్రం తెలుగు సినిమా అని కాకుండా ఇండియన్‌ సినిమా అని చెప్పుకునే స్థాయికి చేరింది. కాగా ఈ చిత్రం విడుదలై నేటికి ఆరేళ్లు పూర్తయిన సందర్భంగా డార్లింగ్‌ ప్రభాస్‌ దీనికి సంబంధించి ఓ ఆసక్తికర పోస్ట్‌ను తన ట్వీటర్‌లో పంచుకున్నాడు.

నిర్మాతల భయాన్ని పోగొట్టిన బాహాబలి...  
అప్ప‌టి వ‌ర‌కు టాలీవుడ్‌ పరిశ్రమలో భారీ బ‌డ్జెట్‌ అంటే పెద్ద స్టార్లతోనే సాధ్యమవుతుందనే భావన ఉండేది. మరో వైపు సినిమాకి ఖర్చు పెట్టిన మొత్తం తిరిగి వస్తుందో లేదో అన్న భయం కూడా నిర్మాతల్లో ఉండేది. ఎందుకంటే తెలుగు పరిశ్రమకు ఇతర భాషల్లో అప్పట్లో ఆదరణ పెద్దగా లేదనే చెప్పాలి. ఈ భయాలన్నింటికీ ఒక్క సినిమా చెక్‌ పెట్టింది. సరైన కథ, అద్భుతమైన నటన, పర్ఫెక్ట్‌ డైరెక్షన్‌ ఇలా అన్ని సమకూరితే బ్లాక్‌ బస్లర్‌కు మించిన విజయం అందుకోవచ్చని నిరూపించింది ‘బాహుబలి’ చిత్రం. 

బాక్సాఫీస్‌ ఊచకోత.. రికార్డులు సౌండ్‌ ప్రపంచ వ్యాప్తంగా మారుమోగింది
గతంలో ఉన్న వాట‌న్నింటిని తుడిచి పెట్టి చ‌రిత్ర సృష్టించింది బాహుబ‌లి. ఈ పీరియాడిక‌ల్ చిత్రం బాక్సాఫీస్ ని షేక్ చేయడమే కాక తెలుగు చిత్రాల ఖ్యాతిని అంతర్జాతీయంగా గుర్తింపుని సంపాదించి పెట్టింది. అదే క్రమంలో మన చిత్రాలకు ఇండియా వైడ్‌గా డిమాండ్‌ని కూడా క్రియేట్‌ చేసింది. మొదట ఒక పార్టుతోనే బాహుబలి ప్లాన్‌ చేసినప్పటికీ బడ్జెట్‌, కథాంశం, పాత్రల నిడివి కారణంగా రెండు భాగాలుగా తెరకెక్కించారు. ఈ రెండు పార్ట్‌లు బాక్స్‌ఫీస్‌ కలెక్షన్లను ఊచకోత కోయడమే గాక వాటి రికార్డుల సౌండ్‌ ప్రపంచవ్యాప్తంగా మారుమోగించేలా చేశాయి. 

విజువల్‌ వండర్‌కు ఆరేళ్లు
ఈ సిరీస్‌లో మొదటి సినిమా బాహుబలి బిగినింగ్ విడుదలై నేటికి 6 యేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్భంగా ప్ర‌భాస్ ఇందులో శివుడి పాత్ర‌కు సంబంధించిన ఓ ఫొటోని షేర్ చేస్తూ..‘ ఆరేళ్లు పూర్తి చేసుకున్న బాహాబలి సినిమా యూనిట్‌ తమ సినిమాటిక్‌ మ్యాజిక్‌తో వరల్డ్‌ వైడ్‌గా తుపాన్‌ సృష్టించిందని పేర్కొన్నాడు.  దేశ వ్యాప్తంగా ఉన్న స్టార్ హీరోల‌ కలెక్షన్లను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్టానంలో నిలిచింది బాహుబలి సిరీస్. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన ‘బాహుబలి’ సినిమా తొలి రూ. 100 కోట్ల పైగా షేర్ సాధించిన చిత్రంగా రికార్డులకు ఎక్కిక సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top