'మొక్కల్నే అంత జాగ్రత్తగా చూసుకుంటే.. మొగున్ని అయితే'.. ఆసక్తిగా టీజర్ | Pailam Pilaga Teaser Released By Director Harish Shankar | Sakshi
Sakshi News home page

Pailam Pilaga Teaser: 'మొక్కల్నే అంత బాగా చూసుకుంటే.. అదే మొగున్ని అయితే'.. ఆసక్తిగా టీజర్

Sep 10 2024 9:00 PM | Updated on Sep 10 2024 9:17 PM

Pailam Pilaga Teaser Released By Director Harish Shankar

సాయి తేజ కల్వకోట, పావని కరణం జంటగా నటించిన చిత్రం 'పైలం పిలగా'. ఈ మూవీకి ఆనంద్ గుర్రం దర్శకత్వం వహిస్తున్నారు. హ్యాపీ హార్స్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రామకృష్ణ బొద్దుల, ఎస్కే శ్రీనివాస్ నిర్మించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను టాలీవుడ్ డైరెక్టర్‌ హరీశ్ శంకర్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఇప్పటికే రిలీజైన పాటలకు ఆడియన్స్‌ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

హరీష్ శంకర్ మాట్లాడుతూ..' టీజర్ చూస్తుంటే సినిమాని చాలా సహజంగా చిత్రీకరించారని తెలుస్తోంది. టీజర్ చాలా చాలా ఎంటర్‌టైనింగ్‌గా అనిపించింది. మంచి డైలాగ్స్ ఉన్నాయి . మొక్కల్నే అంత మంచిగా చూసుకుంటే మొగున్ని ఇంకెంత మంచిగా చూసుకుంటుంది అనే డైలాగ్ నాకు బాగా నచ్చింది' అంటూ ఆయన అభినందించారు . ఈ చిత్రంలో డబ్బింగ్  జానకి, చిత్రం శీను, మిర్చి కిరణ్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు యశ్వంత్ నాగ్ ఆ సంగీతాన్ని అందించారు. ఈ మూవీ సెప్టెంబర్ 20న థియేటర్లలో సందడి చేయనుంది. 

Advertisement
 
Advertisement
Advertisement