ఫాంటసీ చిత్రంలో నిత్యమీనన్‌ | Nithya Menen Latest Movie Updates, She Will Play A Soup Girl In This Fantasy Romcom - Sakshi
Sakshi News home page

ఫాంటసీ చిత్రంలో నిత్యమీనన్‌

Mar 16 2024 7:36 AM | Updated on Mar 16 2024 11:02 AM

Nithya Menen Latest Movie Updates - Sakshi

తమిళసినిమా: దక్షిణాది భాషా నటీమణుల్లో తనకంటూ ప్రత్యేకత కలిగిన నటి నిత్యామీనన్‌. ఈమె ఏ చిత్రంలో ఎలాంటి పాత్రను పోషించినా అందులో తన ముద్ర ఉండేలా చూసుకుంటారు. అలా తమిళం, తెలుగు, మలయాళం, హిందీ భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తున్న నిత్యామీనన్‌ ఇటీవల తమిళంలో నటించిన చిత్రం తిరుచిట్రంఫలం. ధనుష్‌ కథా నాయకుడిగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇందులో నిత్యామీనన్‌ తన నటనకుగానూ విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. ఇకపోతే నిత్యామీనన్‌ను తాజాగా మరో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ కథా చిత్రంలో నటించే అవకాశం వరించింది.

వినోదంతో కూడిన ఫాంటసీ కథా చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రాన్ని బాస్క్‌ టైమ్‌ థియేటర్స్‌, పాప్టర్‌ మీడియా సంస్థ సంయుక్తంగా నిర్మించనున్నారు. ఇందులో వినయ్‌రాయ్‌, నవదీప్‌, ప్రతీక్‌ బబ్బర్‌, దీపక్‌ పరంబోల్‌ ముఖ్యపాత్రలు పోషించనున్నారు. ఈ చిత్రం ద్వారా కామిని దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఆమె దర్శకుడు విష్ణువర్ధన్‌ శిష్యురాలు కావడం గమనార్హం. త్వరలో సెట్‌పైకి వెళ్లనున్న ఈ చిత్రానికి ప్రీతా జయరా మన్‌ చాయాగ్రహణం, కళా దర్శకత్వం బాధ్యతలను షణ్ముగరాజా నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వర లో వెల్లడించనున్నట్లు నిర్మాతలు శుక్రవారం మీడియా కు విడుదల చేసిన మీడియా ప్రకటనలో పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement