Niharika Konidela Birthday Wishes To Photographer Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

Niharika: బర్త్‌ డే విషెస్‌ చెప్పిన నిహారిక.. పోస్ట్ వైరల్

Apr 14 2023 4:47 PM | Updated on Apr 14 2023 5:08 PM

Niharika Birthday Wishes To Photographer Goes Viral - Sakshi

గత కొంతకాలంగా మెగాడాటర్‌ నిహారిక కొణిదెల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో మనస్పర్థల కారణంగా వీరి విడాకులు తీసుకోనున్నారంటూ రూమర్స్ చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. ఇప్పటికే చైతన్య.. నిహారికను అన్‌ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్‌ చేశాడు. అయితే తాజాగా నిహారిక తన ఇన్‌స్టాలో స్టోరీస్‌లో చేసిన పోస్ట్ తెగ వైరలవుతోంది. 

తాజాగా నిహారిక బర్త్‌ డే విషెస్‌ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. యూ ఆర్‌ వెరీ స్పెషల్‌ అంటూ విషెస్‌ చెప్పింది నిహారిక. ప్రముఖ ఫోటోగ్రాఫర్‌ అరిఫ్‌ పుట్టినరోజు సందర్భంగా అతనితో దిగిన పిక్స్ షేర్ చేసింది.  కాగా..  ఇప్పటికే నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా మారిన నిహారిక సొంతంగా పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్‌ బ్యానర్‌కు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది. ఎప్పటి నుంచో సొంతంగా ఆఫీస్‌ నెలకొల్పాలని కలలు కన్న నిహారిక ఇటీవలే ఆ పని పూర్తిచేసింది.

(ఇది చదవండి: అనుకున్న పని చేసేసిన నిహారిక.. కంగ్రాట్స్‌ అంటూ కామెంట్స్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement