Amid Divorce Rumours, Niharika Konidela Started New Office - Sakshi
Sakshi News home page

Niharika Konidela: జీవితంలో మరో ముందడుగు వేసిన నిహారిక.. కంగ్రాట్స్‌ అంటూ కామెంట్స్‌

Apr 10 2023 3:25 PM | Updated on Apr 10 2023 4:17 PM

Amid Divorce Rumours Niharika Konidela Started New Office - Sakshi

గత కొంతకాలంగా మెగాడాటర్‌ నిహారిక కొణిదెల నిత్యం వార్తల్లో నిలుస్తోంది. భర్త చైతన్య జొన్నలగడ్డతో మనస్పర్థల కారణంగా వీరి విడాకులు తీసుకోనున్నారంటూ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై ఇంతవరకు మెగా ఫ్యామిలీలో ఎవరూ స్పందించలేదు. ఇప్పటికే చైతన్య నిహారికను అన్‌ఫాలో చేయడమే కాకుండా పెళ్లి ఫోటోలన్నింటినీ డిలీట్‌ చేశాడు.

ఇప్పుడు భర్త బాటలోనే నిహారిక కూడా ఇప్పటికే అతన్ని ఇన్‌స్టాలో అన్‌ఫాలో చేయగా ఇప్పుడు చైతన్యతో దిగిన ఫోటోలన్నింటినీ డిలీట్‌ చేసేసింది. దీంతో విడాకుల విషయంలో వీరిద్దరూ పరోక్షంగా హింట్‌ ఇచ్చారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్‌ రానుందంటూ సోషల్‌ మీడియా కోడై కూస్తుంది.

ఇదిలా ఉంటే ఇప్పటికే నటనకు గుడ్‌బై చెప్పి నిర్మాతగా మారిన నిహారిక సొంతంగా పింక్‌ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ను నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజాగా నిహారిక మరో ముందడుగు వేసింది. తన ప్రొడక్షన్‌ బ్యానర్‌కు ఒక ఆఫీస్‌ను ఏర్పాటు చేసుకుంది.

ఎప్పటినుంచో సొంతంగా ఆఫీస్‌ నెలకొల్పాలని కలలు కన్న నిహారిక తాజాగా ఆ పని పూర్తిచేసింది.దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. దీంతో పలువురు నిహారికకు కంగ్రాట్స్‌ అంటూ పోస్టులు పెడుతున్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement