Ante Sundaraniki Success Meet: Nani Speech in 'Ante Sundaraniki Movie' Success Celebrations - Sakshi
Sakshi News home page

Ante Sundaraniki Movie: ఇది మనందరి విజయం, మనందరి సెలబ్రేషన్‌

Jun 14 2022 8:28 AM | Updated on Jun 14 2022 8:42 AM

Nani Speech In Ante Sundaraniki Success Celebrations - Sakshi

ఇలాంటి చిత్రాన్ని మనందరం ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగులో భాగం అవుతాం. ఇది మనందరి సినిమా.. ఇది మనందరి విజయం. మనందరి సెలబ్రేషన్‌. అంటే.. సుందరానికీ’కి వస్తున్న స్పందన, అభిమానుల సందేశాలు చూస్తుంటే కడుపు నిండిపోయింది’’ అని హీరో నాని అన్నారు.

‘‘మంచి చిత్రాలు చాలా అరుదుగా వస్తాయి. ‘అంటే.. సుందరానికీ’ కూడా అరుదైన సినిమానే. ఇలాంటి చిత్రాన్ని మనందరం ముందుకు తీసుకెళ్తే తెలుగు సినిమా వేస్తున్న కొత్త అడుగులో భాగం అవుతాం. ఇది మనందరి సినిమా.. ఇది మనందరి విజయం. మనందరి సెలబ్రేషన్‌. అంటే.. సుందరానికీ’కి వస్తున్న స్పందన, అభిమానుల సందేశాలు చూస్తుంటే కడుపు నిండిపోయింది’’ అని హీరో నాని అన్నారు.

వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో నాని, నజ్రియా నజీమ్‌ జంటగా నటించిన చిత్రం ‘అంటే.. సుందరానికీ’. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజైంది. ఈ సందర్భంగా సోమవారం బ్లాక్‌ బస్టర్‌ సక్సెస్‌ మీట్‌లో వివేక్‌ ఆత్రేయ మాట్లాడుతూ– ‘‘అంటే.. సుందరానికీ’ లాంటి వైవిధ్యమైన కథను ఒప్పుకున్న నానీకి, నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు. ‘‘జంధ్యాలగారి ‘అహ నా పెళ్ళంట, శ్రీవారికి ప్రేమలేఖ’ లాంటి క్లాసిక్‌ సినిమా ‘అంటే.. సుందరానికీ’. మా బ్యానర్‌లో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రమిది’’ అన్నారు నవీన్‌ యెర్నేని. సంగీత దర్శకుడు వివేక్‌ సాగర్, నటి అరుణ భిక్షు మాట్లాడారు.

చదవండి:  రక్తం మరిగిన పులి 'గ్యాంగ్‌స్టర్‌ గంగరాజు'.. ఆసక్తిగా ట్రైలర్‌
ఆ వీడియో బయటకు రావడంతో దారుణంగా ట్రోల్‌ చేశారు, ఇక అప్పడే..

Advertisement
 
Advertisement
Advertisement