Naga Chaitanya Speak About Speculations About His Divorce With Samantha, Deets Inside - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: నా జీవితంలో సామ్‌తో గడిపిన దశ అంటే ఎంతో గౌరవం

May 9 2023 1:24 PM | Updated on May 9 2023 1:47 PM

Naga Chaitanya Speak About Speculations About His Divorce With Samantha - Sakshi

నాగ చైతన్య, సమంత విడిపోయి దాదాపు రెండేళ్లు అవుతున్నా.. ఇప్పటికీ వారిద్దరి డివోర్స్‌ ఇష్యూపై  మీడియాలో కథనాలు ప్రసారం అవుతూనే ఉన్నాయి.  సోషల్‌ మీడియాలో సైతం వీరి విడాకుల వ్యవహారంపై ఏదో ఒక రూమర్‌ పుట్టుకొస్తూనే ఉన్నాయి. అవి తనకు చాలా బాధను కలిగిస్తున్నాయని నాగచైతన్య అంటున్నారు. 

తాజాగా ఆయన నటించిన చిత్రం కస్టడీ. ఈ చిత్రం మే 12న విడుదల కాబోతుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ యూట్యూబ్‌ చానెల్‌కి ఇంటర్వ్యూ ఇచా​రు. అందలో సమంతతో విడాకుల తర్వాత తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించారు. 

(చదవండి: వారి కోసం అవార్డునే అమ్మేశాడు.. దటీజ్‌ విజయ్‌ దేవరకొండ! )

‘దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల సమంత, నేను విడిపోయాం. కానీ నా జీవితంలో సమంతతో గడిపిన దశ అంటే ఎంతో గౌరవం ఉంది. కానీ గత రెండేళ్లుగా మీడియాలో ఈ విషయంపై వస్తున్న రూమర్స్‌ వల్ల ఆ గౌరవాన్ని తీసేస్తున్నారు. నా సినిమాల గురించి ఏం మాట్లాడినా ఓకే కానీ.. నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే బాధ కలుగుతుంది. మాకు కోర్టు విడాకులు మంజూరు చేసి ఏడాదిపైన అవుతుంది.

ఇంకా ఇదే విషయాన్ని మీడియా సాగదీస్తుంది. మా ఇద్దరితో ప్రమేయం లేని మూడో వ్యక్తిని కూడా వార్తల్లోకి లాగుతున్నారు. వాళ్ల కుటుంబాలు ఎంత బాధ పడుతుందో ఆలోచించడం లేదు. కేవలం హెడ్‌లైన్స్‌ కోసం ఇలా చేయడం చాలా బాధాకరం.  విడాకులపై నేను, సామ్‌ బహిరంగంగా స్టేట్‌మెంట్‌ ఇచ్చాం. ఇకనైనా ఈ విషయాన్ని వదిలేస్తారని ఆశిస్తున్నాను’అని చై చెప్పుకొచ్చాడు.

Advertisement
 
Advertisement
Advertisement