Naga Chaitanya Akkineni Open Shoyu Restaurant in Hyderabad - Sakshi
Sakshi News home page

Naga Chaitanya: కొత్త బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేసిన చై..

Mar 4 2022 5:04 PM | Updated on Mar 4 2022 7:02 PM

Naga Chaitanya Akkineni Opens Shoyu Restaurant in Hyderabad - Sakshi

అక్కినేని హీరో నాగ చైతన్య ప్రస్తుతం వరుస సినిమాలను లైన్‌లో పెట్టాడు. రీసెంట్‌గానే బంగార్రాజు చిత్రంతో హిట్‌ కొట్టిన చై ప్రస్తుతం ఓ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నాడు. సమంతతో విడాకుల అనంతరం అటు ప్రొఫెషనల్‌గానే కాకుండా పర్సనల్‌ లైఫ్‌లోనూ చైలో చాలానే మార్పు కనిపిస్తుంది. ఇదివరకు సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని చైతూ ఈ మధ్యకాలంలో మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నాడు.

సినిమా ప్రమోషన్స్‌తో పాటు తనకి సంబంధించిన అప్‌డేట్స్‌ని సైతం అప్పుడప్పుడూ నెటిజన్లతో షేర్‌ చేసుకుంటున్నాడు. తాజాగా చై ఫుడ్‌ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చేశాడు. షోయూ పేరుతో హైదరాబాద్‌లో ఓ సరికొత్త రెస్టారెంట్‌ ఓపెన్‌ చేశాడు. దీనికి సంబంధించిన వీడియోను సైతం చై తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. దీనికి వెంకటేశ్‌ కూతురు ఆశ్రిత.. 'ఈ కొత్త ప్రయాణానికి శుభాకాంక్షలు బావా' అంటూ బెస్ట్‌ విషెస్‌ అందించింది. 

Advertisement
 
Advertisement
Advertisement