అది మాత్రమే మన హక్కు.. ప్రకృతికి రుణపడి ఉంటా: నభా | Nabha Natesh Shares Beautiful Post on World Environment Day | Sakshi
Sakshi News home page

Nabha Natesh: చెట్టును ఆలింగనం చేసుకున్నా.. అది కూడా తిరిగి నన్ను..

Jun 5 2025 7:23 PM | Updated on Jun 5 2025 8:21 PM

Nabha Natesh Shares Beautiful Post on World Environment Day

హీరోయిన్ నభా నటేష్ (Nabha Natesh).. ఈ రోజు (జూన్‌ 5న) ప్రపంచ పర్యావరణ దినోత్సవం (World Environment Day) సందర్భంగా చెట్టును కౌగిలించుకున్న ఫొటోను షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఈ రోజు ఒక చెట్టును కౌగిలించుకున్నాను... ఆ చెట్టు కూడా నన్ను తిరిగి కౌగిలించుకుందనే భావన కలిగింది. ఎంతో అందమైన ఈ ప్రపంచాన్ని చూసేందుకు వచ్చిన అతిథులం మనం. ఇక్కడ ప్రకృతి మనకెన్నో గొప్ప అనుభవాలు ఇస్తోంది. ఈ ప్రకృతిని, పర్యావరణాన్ని అనుభూతి చెందడం మాత్రమే మనకున్న హక్కు. ఈ సంతోషాలు ఇచ్చిన నేచర్‌కు రుణపడి ఉంటాను అని రాసుకొచ్చింది.

ఇది చూసిన నెటిజన్లు ప్రకృతి గురించి నభా బ్యూటిఫుల్ మెసేజ్ ఇచ్చిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే నభా నటేష్.. నిఖిల్ హీరోగా నటిస్తున్న స్వయంభుతో పాటు మరో నాగాభరణం అనే మూవీలో నటిస్తోంది. ఈ రెండు భారీ పాన్ ఇండియా చిత్రాలుగా రూపొందుతున్నాయి. త్వరలో స్వయంభు, నాగాభరణం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. మరికొన్ని క్రేజీ చిత్రాలు నభా లైనప్ లో ఉన్నాయి.

 

 

చదవండి: 'దీపికాతో రెండేళ్ల ప్రేమ..' కుక్కలా హీనంగా చూసేది.. :హీరో

Advertisement
 
Advertisement
Advertisement