Music director Kaithapram Viswanathan Dies Of Cancer At 58 - Sakshi
Sakshi News home page

Kaithapram Viswanathan: మాలీవుడ్‌లో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు కన్నుమూత

Dec 30 2021 10:49 AM | Updated on Dec 30 2021 11:23 AM

Music director Kaithapram Viswanathan Dies Of Cancer At 58 - Sakshi

Music director Kaithapram Viswanathan Passed Away: మాలీవుడ్‌ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ మలయాళ మ్యూజిక్‌ డైరెక్టర్‌ కైతప్రమ్‌ విశ్వనాథన్‌ నంబూద్రి (58) కన్నుమూశారు. గత కొన్నాళ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. విశ్వనాథన్‌కు భార్య గౌరి, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

1963లో సంగీత కుటుంబంలో జన్మించిన ఆయన మ్యూజిక్‌ టీచర్‌గా కెరీర్‌ ప్రారంభించి కన్నకి, తిలక్కం సహా 20కి పైగా చిత్రాలకు సంగీతం అందించారు. ఆయన చేసిన సేవలకు గాను గానభూషణం అనే బిరుదును సైతం సంపాదించుకున్నారు. 'కన్నకి' చిత్రానికి గాను 2001లో కేరళ ప్రభుత్వం స్టేట్‌ అవార్డుతో ఆయన్ని సత్కరించింది. కాగా విశ్వనాథన్‌ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement