Megastar Son In Law Kalyan Dev Pic With Heroine Varnika Goes Viral, Deets Inside - Sakshi
Sakshi News home page

Kalyan Dev : మరోసారి వార్తల్లోకెక్కిన కల్యాణ్‌దేవ్‌..  ఆ ఫోటో వైరల్‌

Oct 18 2022 12:53 PM | Updated on Oct 18 2022 1:45 PM

Megastar Son In Law Kalyan Dev Pic With Heroine Varnika Viral - Sakshi

మెగా అల్లుడు కల్యాణ్‌ దేవ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. చిరంజీవి చిన్నకూతురు శ్రీజను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా కల్యాణ్‌ దేవ్‌ పర్సనల్‌ లైఫ్‌కు సంబంధించి ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఇదిలా ఉండగా ఓ హీరోయిన్‌తో కల్యాణ్‌ దేవ్‌ షేర్‌ చేసిన ఓ ఫోటో ఇప్పుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

వర్ణిక రాథోర్‌ అనే హీరోయిన్‌తో దిగిన ఓ ఫోటోను షేర్‌ చేసిన కల్యాణ్‌ దేవ్‌ దీనికి నా లైఫ్‌ను మార్చేసిన కళల రాణి అంటూ క్యాప్షన్‌తో ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చారు. దీంతో కల్యాణ్‌ దేవ్‌ మాటల వెనకున్న అర్థమేంటని నెటిజన్లు ఆరాతీస్తున్నారు.

ఆయన మరోసారి పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ కొన్ని వార్తలు కూడా వచ్చిన నేఫథ్యంలో కల్యాణ్‌ దేవ్‌ షేర్‌ చేసిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ వార్తల్లో నిజం లేదని ఆమె కల్యాణ్‌ దేవ్‌ చేస్తున్న సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యిందని, ఈ  క్రమంలోనే ఫోటో బయటికొచ్చిందని తెలుస్తుంది. 

Advertisement
 
Advertisement
Advertisement