'దేవర'లో నా పాత్ర ఇదే.. రివీల్‌ చేసిన మరాఠీ బ్యూటీ | Marathi Actress Shruti Marathe Confirmed In Devara Movie | Sakshi
Sakshi News home page

'దేవర'లో నా పాత్ర ఇదే.. రివీల్‌ చేసిన మరాఠీ బ్యూటీ

Mar 23 2024 7:43 AM | Updated on Mar 23 2024 8:43 AM

Marathi Actress Shruti Marathe Confirmed In Devara Movie - Sakshi

జూనియర్‌ ఎన్టీఆర్‌- జాన్వీ కపూర్‌ జోడీగా దేవర సినిమా యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన గ్లింప్స్‌ విపరీతంగా మెప్పించింది. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాపై ఫ్యాన్స్ కూడా భారీ అంచనాలు పెట్టుకున్నారు.

మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే... దేవర చిత్రంలో నటించనుందంటూ కొన్నిరోజుల నుంచి వస్తున్న వార్తలు ఇప్పుడు నిజమయ్యాయి. దేవరలో నటిస్తున్నట్లు  ఆమె స్వయంగా వెల్లడించింది. ఇప్పటికే ఇందులో జాన్వీకపూర్‌ తంగం అనే పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. వాస్తవంగా ఆమె హైదరాబాద్‌లో జరిగిన ‘దేవర’ షూటింగ్‌లోనే జాయిన్‌ అయింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రుతీ మాట్లాడుతూ.. 'దేవరలో సినిమాలో నేను భాగం అయినట్లు సోషల్‌ మీడియా ద్వారా అందరికీ తెలిసింది. అందులో నేను దేవరకు భార్యగా కనిపిస్తాను. అక్టోబర్‌ 10న పాన్‌ ఇండియా రేంజ్‌లొ ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రం కోసం ఎన్టీఆర్‌ అభిమానుల మాదిరే నేను కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అని చెప్పారు. దీంతో దేవరలో ఇద్దరు హీరోయిన్లు అనే విషయం క్లారిటీ వచ్చేసింది. ఇందులో ఎన్టీఆర్‌ డబుల్‌ రోల్‌లో నటిస్తున్న విషయం దాదాపు ఖాయం అని తేలిపోయింది.

తాజాగా ఈ మూవీ షూట్‌లకు సంబంధించిన జూనియర్ లుక్‌ నెట్టింట తెగ వైరలవుతోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ గోవాలో జరుగుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఎన్టీఆర్‌ ఫోటోను షేర్ చేసింది. ఇది చూసిన అభిమానులు దేవర లుక్ అదిరిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.  కాగా.. ఈ సినిమా అక్టోబర్‌ 10న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement