మలయాళ బ్లాక్‌బస్టర్‌ మూవీ తెలుగులో.. ట్రైలర్‌ చూశారా? | Manjummel Boys Telugu Trailer Released | Sakshi
Sakshi News home page

Manjummel Boys: మలయాళంలో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన మూవీ తెలుగులో.. ట్రైలర్‌ చూశారా?

Mar 31 2024 7:17 PM | Updated on Apr 1 2024 10:05 AM

Manjummel Boys Telugu Trailer Released - Sakshi

కానీ వారి స్నేహితులు మాత్రం అతడిని అలా వదిలేసి పోవడానికి ఇష్టపడరు. మరి ఆ గ్యాంగ్‌.. అతడిని ఎలా రక్షించారనేదే కథ!  ట్రైలర్‌ అదరిఇపోయింది. ఫన్‌తో పాటు స

మలయాళంలో రూ.200 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఏకైక బ్లాక్‌బస్టర్‌ సినిమా మంజుమ్మెల్‌ బాయ్స్‌. 2006లో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కించారు. మాలీవుడ్‌లో మునుపెన్నడూ ఊహించని రేంజ్‌లో బాక్సాఫీస్‌ కలెక్షన్స్‌ను రాబట్టిన ఈ మూవీ తెలుగులోకి రానున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో ఆదివారం (మార్చి 31) మంజుమ్మెల్‌ బాయ్స్‌ ట్రైలర్‌ రిలీజ్‌ చేశారు.

లోతైన గుహలో..
ఎంతో చలాకీగా, ఆడుతూ పాడుతూ ఉండే మంజుమ్మెల్‌ బాయ్స్‌ టీమ్‌ విహారయాత్ర కోసం కొడైకెనాల్‌ వెళ్తుంది. అందులో ఒకరు లోతైన గుణ గుహలో పడిపోతారు. అతడిని కాపాడేందుకు సహాయబలగాలు సైతం చేతులెత్తేస్తాయి. కానీ వారి స్నేహితులు మాత్రం అతడిని అలా వదిలేసి పోవడానికి ఇష్టపడరు. మరి ఆ గ్యాంగ్‌.. అతడిని ఎలా రక్షించారు? అనేది సినిమా కథ!  ట్రైలర్‌ అయితే అదిరిపోయింది. ఫన్‌తో పాటు సస్పెన్స్‌ గ్యారెంటీ అన్నట్లుగా ఉంది. ఈ మూవీ ఏప్రిల్‌ 6న తెలుగులో విడుదల కానుంది.

సౌబిన్‌ షహీర్‌, శ్రీనాథ్‌ భాసి, బాలు వర్గీస్‌, గణపతి, జేన్‌ పాల్‌ లాల్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి చిదంబరం దర్శకరచయితగా వ్యవహరించాడు. బాబూ షహీర్‌, సౌబిన్‌ షహీర్‌, షాన్‌ ఆంటోని నిర్మించారు. సుషిన్‌ శ్యామ్‌ సంగీత దర్శకుడిగా పని చేశాడు. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాను తెలుగులోకి తీసుకువస్తోంది.

చదవండి: 

Advertisement
 
Advertisement
Advertisement