మంజుల ఘ‌ట్ట‌మ‌నేని ఇల్లు చూశారా? ఎంత అందంగా ఉందో! | Mahesh Babu Sister Manjula Ghattamaneni Home Tour Pics And Video Trending On Social Media - Sakshi
Sakshi News home page

Manjula Ghattamaneni Home Tour: మంజుల ఇల్లు చూశారా? ఇంటీరియ‌ర్ అదిరింది.. ఏకంగా ఆరు బాల్క‌నీలు..

Nov 4 2023 4:33 PM | Updated on Nov 4 2023 5:06 PM

Manjula Ghattamaneni Home Tour Pics, Video Goes Viral - Sakshi

మా ఇల్లు చాలా సింపుల్‌గా ఉంటుంది. మ‌రీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు' అంటూ త‌న ఇంటిని చూపించింది. దేవుడి పూజ‌తోనే రోజును ప్రారంభిస్తాను అంటూ మొద‌ట

స్టార్ హీరోల కుటుంబాల నుంచి అబ్బాయిలు క‌థానాయ‌కుడిగా వెండితెర‌పై రంగ‌ప్ర‌వేశం చేస్తుంటారు. అమ్మాయిలు చాలా అరుదుగా వెండితెర‌పై మెరుస్తుంటారు. అయితే సూప‌ర్ స్టార్ కృష్ణ రెండో కూతురు మంజుల బాల‌న‌టిగా న‌టించ‌డ‌మే కాకుండా త‌ర్వాతి క్ర‌మంలో నిర్మాత‌గా, ద‌ర్శ‌కురాలిగా కొన‌సాగింది. శ‌భాష్ గోపి సినిమాలో హీరోయిన్‌గా న‌టించిన మంజుల మ‌ల‌యాళంలో స‌మ్మ‌ర్ ఇన్ బెత్లెహామ్‌,  త‌మిళంలో రాజ‌స్థాన్ మూవీలో న‌టించింది. త‌ర్వాత షో సినిమాతో నిర్మాత‌గా మారింది. మ‌హేశ్‌బాబు నాని, పోకిరి, ఏ మాయ చేశావె సినిమాల నిర్మాణంలో పాలుపంచుకుంది. మ‌న‌సుకు న‌చ్చింది చిత్రంతో డైరెక్ట‌ర్‌గానూ మారింది. ఈ మ‌ధ్యే విడుద‌లైన‌ మంత్ ఆఫ్ మ‌ధు సినిమాలోనూ క‌నిపించింది.

పూజ‌తోనే రోజు ప్రారంభం
తాజాగా ఈ టాలెంటెడ్ న‌టి, నిర్మాత‌ త‌న యూట్యూబ్ ఛాన‌ల్‌లో హోంటూర్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో మంజుల‌ మాట్లాడుతూ.. 'నేను హోంటూర్ చేస్తున్నాను. మా ఇల్లు చాలా సింపుల్‌గా ఉంటుంది. మ‌రీ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు' అంటూ త‌న ఇంటిని చూపించింది. దేవుడి పూజ‌తోనే రోజును ప్రారంభిస్తాను అంటూ మొద‌ట పూజ‌గ‌దిని చూపించింది. లివింగ్ ఏరియా, డైనింగ్ రూమ్‌, కిచెన్ గ‌దులను చూపించింది. త‌న కూతురి కోసం చిన్న‌ప్ప‌టి నుంచి కొన్న బొమ్మ‌లు, ఆట‌వ‌స్తువులు అన్నింటినీ చిన్న‌పాటి గ‌దిలో అందంగా అమ‌ర్చింది.

ఇంట్లో ఆఫీస్ రూమ్ & బార్‌
అంద‌రూ క‌లిసి క‌బుర్లాడుకునేందుకు ఒక ఫ్యామిలీ రూమ్ కూడా ఉంది. అలాగే కాఫీ బార్‌ను చూపిస్తూ అది త‌న భ‌ర్త‌కు ఎంతో ఇష్ట‌మ‌ని పేర్కొంది. ఇంట్లో ఉన్న పెయింటింగ్స్‌ను చూపిస్తూ దాని ప్ర‌త్యేక‌త‌లు కూడా చెప్పుకొచ్చింది. ఇక ఇంట్లోనే ఆఫీస్ రూమ్ ఏర్పాటు చేసుకుంది మంజుల‌. త‌న‌కు పుస్త‌కాలు చ‌ద‌వ‌డం అంటే ఎంతో ఇష్ట‌మని వీలైతే మీరు కూడా చ‌ద‌వండి అని అభిమానుల‌కు స‌ల‌హా ఇచ్చింది.

ఇంట్లో ఆరు బాల్క‌నీలు
ప్ర‌కృతితో మ‌మేకం అవ‌డం అంటే చాలా ఇష్ట‌మ‌ని, అందుకే త‌న ఇంటికి ఆరు బాల్క‌నీలు ఉన్నాయంది. ఒక బాల్క‌నీలో డైనింగ్ టేబుల్ ఉండ‌గా కొన్నిసార్లు అక్క‌డే రాత్రిపూట భోజ‌నం చేస్తామంది. పెర‌ట్లో చాలా ర‌కాల చెట్లున్నాయంది. జిమ్ ఏరియాలో టేబుల్ టెన్నిస్ కూడా ఏర్పాటు చేసింది. ఇంటిపై భాగంలోనూ చిన్నపాటి గార్డెన్ ఏర్పాటు చేసింది.. మంజుల చెప్పిన‌ట్లుగానే త‌న ఇల్లు చాలా సింపుల్‌గా అలాగే ఎంతో అందంగా ఉంది.

చ‌ద‌వండి: అప్పటిలా లేను.. చాలా మారిపోయా: అనసూయ

Advertisement
 
Advertisement
Advertisement