Mahima Nambiar Acts In Chandramukhi-2 Movie As Lead Role - Sakshi
Sakshi News home page

Mahima Nambiar: అదే నా చిరకాల స్వప్నం.. చంద్రముఖి-2 హీరోయిన్!

Aug 4 2023 3:23 PM | Updated on Aug 4 2023 4:01 PM

Mahima Nambiar Acts In Chandramukhi-2 Movie as Lead role - Sakshi

మలయాళ బ్యూటీ మహిమా నంబియార్‌ ఇప్పుడు చాలా ఖుషీగా ఉంది. ఈ మలయాళ బ్యూటీ తన 13 ఏళ్ల కెరీర్‌లో నటించింది తక్కువ చిత్రాలే అయినా మంచి పేరుని తెచ్చుకుంది. దీనికి కారణం మంచి పాత్రలను ఎంపిక చేసుకోవడమే. మలయాళం, తమిళం భాషల్లో నటిస్తున్న మహిమా నంబియార్‌ఆమె 2010లో మలయాళం సినిమా కార్యస్థాన్ చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టింది. ఆ తర్వాత 2012లో సట్టై సినిమాతో కోలీవుడ్‌కు పరిచయమైంది. 

(ఇది చదవండి: షారుఖ్‌పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ - మిగిలిన వారికంటే..!)

ఆమె నటించిన తొలి చిత్రమే మంచి సక్సెస్‌ కావడంతో ఆ తర్వాత కుట్రం 23, కొడి వీరన్‌, మహాముని తదితర చిత్రాల్లో నటించే అవకాశం వరించింది. వీటిలో ఎక్కువ శాతం సక్సెస్‌ కావడం ఈమె కెరీర్‌కు ప్లస్‌ అయ్యింది. కాగా ప్రస్తుతం చంద్రముఖి– 2 లాంటి వంటి భారీ చిత్రంతో తమిళ ప్రేక్షకుల ముందుకు రానుంది. రజనీకాంత్‌, ప్రభు, నయనతార, జ్యోతిక, వడివేలు ప్రధాన పాత్రలు పోషించిన చంద్రముఖి చిత్రానికి ఇది సీక్వెల్‌గా తెరకెక్కించారు. 

ఇందులో రజనీకాంత్‌ పోషించిన పాత్రలో నృత్య దర్శకుడు రాఘవ లారెన్స్ నటించడం విశేషం. అదే విధంగా బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ జ్యోతిక పాత్రలో నటించగా.. లక్ష్మి మీనన్‌, సృష్టి డాంగే, రాధిక శరత్‌ కుమార్‌, వడివేలు తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. వీరితో పాటు మహిమ నంబియార్‌ ఒక నాయకిగా నటిస్తోంది. 

పి. వాసు దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం షూటింగ్‌ ఇప్పటికే పూర్తి చేసుకుంది. కాగా ఈ చిత్రంలోని ఓ పాటను చిత్రీకరిస్తున్నారు. దీని గురించి మహిమా నంబియార్‌ తన ట్విట్టర్‌లో చంద్రముఖి– 2 చిత్రంలోని పాట చిత్రీకరణ కోసం జార్జియా వెళుతున్నట్లు పేర్కొంది. ఒక నటిగా లారెన్‌న్స్‌ మాస్టర్‌తో కలిసి డాన్స్‌ చేయాలన్నది తన చిరకాల కలని అది ఇప్పుడు నెరవేరడం సంతోషంగా ఉందని పేర్కొంది.

(ఇది చదవండి: పెళ్లికి సిద్ధమైన హీరోయిన్.. అఫీషియల్‌గా ప్రకటించిన భామ!)

Advertisement
 
Advertisement
Advertisement