ఐ హేట్‌ లవ్‌ | Maama Mascheendra Teaser Launch | Sakshi
Sakshi News home page

ఐ హేట్‌ లవ్‌

Apr 23 2023 4:08 AM | Updated on Apr 23 2023 4:08 AM

Maama Mascheendra Teaser Launch - Sakshi

‘‘దేవుడడిగాడంట.. నన్ను చేరడానికి ఏడు జన్మలు నాకు భక్తుల్లా బతుకుతారా...లేక మూడు జన్మలు రాక్షసుల్లా బతుకుతారా అని. ఏడు జన్మలు నీకు దూరంగా ఉండే కన్నా... మూడు జన్మల రాక్షస బతుకే మిన్న అని దేవతలే కోరుకున్నారట’, ‘ఐ హేట్‌ లవ్‌’ అనే డైలాగ్స్‌తో విడుదలైంది ‘మామా మశ్చీంద్ర’ టీజర్‌.

సుధీర్‌బాబు హీరోగా హర్షవర్ధన్‌ నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ఇది. తెలుగు, హిందీ భాషల్లో రూపొందిన ఈ చిత్రంలో మృణాళినీ రవి, ఈషా రెబ్బా హీరోయిన్లు. సోనాలీ నారంగ్, సృష్టి సమర్పణలో సునీల్‌ నారంగ్, పుçస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్‌ కానుంది. శనివారం ఈ సినిమా టీజర్‌ను హీరో మహేశ్‌బాబు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ చిత్రంలో దుర్గ, డీజే, పరశురామ్‌ పాత్రలు చేశారు సుధీర్‌బాబు.

Advertisement
 
Advertisement
Advertisement