ప్రభాస్ ఫ్యాన్స్ పోరు పడలేక ఆ ఫొటో పెట్టాడా? | Korean Actor Donlee Prabhas Salaar 2 Poster | Sakshi
Sakshi News home page

Prabhas Donlee: కొరియన్ యాక్టర్.. ప్రభాస్ ఫొటో.. రచ్చ రచ్చ

Nov 10 2024 12:27 PM | Updated on Nov 10 2024 1:26 PM

Korean Actor Donlee Prabhas Salaar 2 Poster

డార్లింగ్ ప్రభాస్ ప్రస్తుతం ఊపిరి సలపనంత బిజీగా ఉన్నాడు. 'రాజాసాబ్', 'ఫౌజీ'(వర్కింగ్ టైటిల్) మూవీస్ షూటింగ్స్ జరుగుతున్నాయి. వచ్చే నెల నుంచి 'స్పిరిట్' షురూ అవుతుంది. మరో మూడు నాలుగు సినిమాలు లైన్‌లో ఉన్నాయి. అయితే ప్రభాస్ 'స్పిరిట్'లో కొరియన్ స్టార్ డాన్ లీ ఉంటాడనే ప్రచారం కొన్నిరోజుల క్రితం జరిగింది. ఇప్పుడు ఇందులో మరో ట్విస్ట్!

(ఇదీ చదవండి: పెళ్లికి రెడీ అయిన 46 ఏళ్ల తెలుగు నటుడు)

కొరియన్ సినిమాల్లో మాఫియా డాన్, గ్యాంగ్‌స్టర్ పాత్రలు ఎక్కువగా చేసే మా డాంగ్ స్యూక్ అలియాస్ డాన్ లీ.. ఇప్పుడు ప్రభాస్ 'సలార్ 2' పోస్టర్ ఒకటి తన్ ఇన్ స్టా స్టోరీలో పోస్ట్ చేశాడు. థంబ్సప్ సింబల్ కూడా దానిపై పెట్టాడు. దీంతో తెలుగు నెటిజన్లు.. రచ్చ రచ్చ చేస్తున్నారు. సలార్ 2 లో విలన్ ఇతడే అన్నట్లు సోషల్ మీడియాలో తెగ పోస్టులు పెడుతున్నారు. 'స్పిరిట్' మూవీలో విలన్ గా చేస్తాడని అన్నారు కదా మరి 'సలార్ 2' పోస్టర్ ఎందుకు పెట్టాడా అని మరి కొందరు అనుకుంటున్నారు.

'స్పిరిట్'లో ఇతడు యాక్ట్ చేస్తాడనే రూమర్ వచ్చినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్.. డాన్ లీ ఇన్ స్టాలో ప్రతి పోస్ట్ దిగువన ప్రభాస్-స్పిరిట్-సలార్ 2 అని వందలకొద్ది కామెంట్స్ చేశారు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నారు. దీంతో వీళ్ల పోరు పడలేకపోయాడో ఏమో గానీ 'సలార్ 2' పోస్టర్ షేర్ చేశాడా అనిపిస్తుంది. మరి ఇందులో నిజానిజాలు ఏంటనేది డాన్ లీ ఫుల్ క్లారిటీ ఇస్తే తప్ప తెలియదు.

(ఇదీ చదవండి: ఆర్జీవీ మేనకోడలు పెళ్లిలో రష్మిక, విజయ్ దేవరకొండ)

Advertisement
 
Advertisement
Advertisement