Kajal Aggarwal Interesting Comments At Ghosty Movie Promotions | Kajal Aggarwal Ghosty Movie Promotion Interview - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: బిడ్డ పుట్టిన మూడు నెలలకే వచ్చాను.. అందరు ప్రశ్నిస్తు‍న్నారు: కాజల్‌ అగర్వాల్‌

Mar 7 2023 8:29 AM | Updated on Mar 7 2023 9:42 AM

Kajal Aggarwal Talks In Her Ghosty Movie Promotions In Chennai - Sakshi

తమిళసినిమా: పెళ్లికి ముందు తమిళం, తెలుగు, హిందీ అంటూ పలు భాషల్లో టాప్‌ హీరోయిన్‌గా నటి కాజల్‌ అగర్వాల్‌ రాణించారు. ఓ బిడ్డకు తల్లి అయిన తరువాత కూడా కథానాయకిగా అవకాశాలను రాబట్టుకుంటున్నారు. ఇండియన్‌ 2 చిత్రంలో కమలహసన్‌కు జంటగా నటించడానికి అంగీకరించారు. ఆ చిత్రం కొంత షూటింగ్‌ జరుపుకున్న తరువాత కొన్ని ఘటనల కారణంగా ఆగిపోయింది. ఆ తరువాత నటి కాజల్‌ అగర్వాల్‌ ప్రేమించిన వ్యక్తిని పెళ్లాడి బిడ్డకు తల్లి కూడా అయ్యారు. దీంతో కాజల్‌ ఇక నటనకు గుడ్‌బై చెప్పినట్లే అని చాలా మంది అనుకున్నారు.

చదవండి: కళ్లు చెదిరేలా కమెడియన్‌ రఘు లగ్జరీ ఇల్లు.. చూశారా?

లక్కీగా అలాంటి సమయంలోనే ఇండియన్‌ –2 చిత్ర షూటింగ్‌ మళ్లీ ప్రారంభం అయ్యింది. దీంతో కాజల్‌ అగర్వాల్‌ రీఎంట్రీ షురూ అయ్యింది. కాగా ఇప్పుటికే కాజల్‌ అగర్వాల్‌ నటించిన ఘోస్టీ చిత్రం ఈ నెల 17న తెరపైకి రానుంది. ఇందులో కాజల్‌ తొలిసారిగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. ఘోస్టీ హర్రర్‌ కామెడీ జానర్‌లో రూపొందిన చిత్రాన్ని సుందరం, జి.జయరామ్‌ కలిసి నిర్మించారు. కల్యాణన్‌ దర్శకత్వం వహించారు. శ్యామ్‌ సీఎస్‌ సంగీతాన్ని అందించిన ఈ చిత్రం గురించి సోమవారం మధ్యాహ్నం చెన్నైలో చిత్ర యూనిట్‌ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాజల్‌అగర్వాల్‌ పాల్గొన్నారు.

చదవండి: ఆ సినిమా నేను చేసి ఉండకూడదు: లయ షాకింగ్‌ కామెంట్స్‌

ఇది హార్రర్‌ కామెడీ జానర్‌లో సాగే చిత్రం అని చెప్పారు. తాను పోలీస్‌ అధికారిగా, దెయ్యంగా రెండు పాత్రలు పోషించినట్లు కాజల్‌ చెప్పారు. బిడ్డను కన్న మూడు నెలలకే నటించడానికి రావడం గురించి అందరూ అడుగుతున్నారని, అందుకు కారణం తనకు నటన పట్ల ఉన్న ఇష్టమే కారణమన్నారు. తన కుమారుడిని తన తల్లి చూసుకుంటారని, అందుకే తాను కెమెరా ముందు ఎలాంటి టెన్షన్‌ లేకుండా నటించగలుగుతున్నానని చెప్పారు. క్షమశిక్షణ ఉంటే బరువు తగ్గడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. అందుకు చాలా కసరత్తులు చేశానని, గర్రుపు స్వారీ, కర్రసాము, విలువిద్యలోనూ శిక్షణ పొందినట్లు చెప్పారు. ప్రస్తుతం తెలుగులో బాలకృష్ణకు జంటగా నూతన చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నాట్లు కాజల్‌ వెల్లడించారు.   

Advertisement
 
Advertisement
Advertisement