దుబాయ్ నుంచి తిరిగొచ్చిన యంగ్ టైగర్.. వీడియో వైరల్! | Junior NTR Rerurns From Dubai Vacation With Family | Sakshi
Sakshi News home page

Junior NTR: వేకేషన్ నుంచి తిరిగొచ్చిన తారక్.. దేవర షెడ్యూల్ షురూ!

Jun 4 2023 11:40 AM | Updated on Jun 4 2023 12:16 PM

Junior NTR Rerurns From Dubai Vacation With Family - Sakshi

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జంటగా నటిస్తోన్న చిత్రం దేవర. ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ హైదరాబాద్‌లో మొదటి షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఎప్పుడు షూటింగ్‌లతో బిజీగా జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి గతవారం దుబాయ్‌ వెళ్లారు. ఎయిర్‌పోర్టులో ఎన్టీఆర్ ఫ్యామిలీతో కనిపించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరలయ్యాయి.

(ఇది చదవండి: పెళ్లిపీటలెక్కనున్న జబర్దస్త్‌ కమెడియన్‌ కెవ్వు కార్తీక్‌!)

అయితే ఫ్యామిలీతో దుబాయ్‌ వేకేషన్ వెళ్లిన తారక్ శనివారం హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. ఎయిర్‌పోర్ట్‌లో తన కుమారులతో కలిసి కనిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. ప్రస్తుతం దేవర సినిమాలో నటిస్తోన్న ఎన్టీఆర్‌ తదుపరి షెడ్యూల్ కోసం గోవా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు సమాచాపరం. ఒక పాటతో పాటు యాక్షన్ సీక్వెన్స్‌ను షూట్ చేస్తారని తెలుస్తోంది.

(ఇది చదవండి: మరోసారి జంటగా లవ్‌ బర్డ్స్.. డేటింగ్‌పై మొదలైన చర్చ!)

Advertisement
 
Advertisement
Advertisement