Joju George: వైష్ణవ్‌ తేజ్‌ సినిమాతో టాలీవుడ్‌లోకి మలయాళ నటుడు ఎంట్రీ

Joju George Joins in the Sets Of Vaishnav Tej Movie - Sakshi

వైష్ణవ్‌ తేజ్, శ్రీలీల జంటగా నూతన దర్శకుడు ఎన్‌.శ్రీకాంత్‌ రెడ్డి ఓ సినిమాను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎస్‌.నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమాలోని చెంగారెడ్డి పాత్రలో మలయాళ నటుడు జోజు జార్జ్‌ నటిస్తున్నట్లుగా వెల్లడించి, ఆయన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను బుధవారం విడుదల చేసింది చిత్రయూనిట్‌.

‘‘పూర్తి స్థాయి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో వైష్ణవ్‌ తేజ్‌ సరికొత్త మాస్‌ అవతారంలో కనిపిస్తారు. ‘జోసెఫ్, నాయట్టు, ఇరాట్ట’ వంటి మలయాళ హిట్‌ ఫిల్మ్స్‌లో నటించిన జోజు జార్జ్‌ ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నారు’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది. తెలుగులో ఆయనకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top