మరోసారి రెచ్చిపోయిన హైపర్‌ ఆది.. వ్యాఖ్యలు దుమారం | Hyper Aadi Shocking Comments On Varsha | Sakshi
Sakshi News home page

వర్షపై బాడీషేమింగ్‌ చేసిన హైపర్‌ ఆది

Apr 3 2021 2:36 PM | Updated on Apr 3 2021 4:50 PM

Hyper Aadi Shocking Comments On Varsha - Sakshi

హైపర్‌ ఆది..ఈ పేరు తెలియని బుల్లితెర ప్రేక్షకులు ఉండరనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. తనదైన కామెడీ టైమింగ్‌, పంచు డైలాగులతో షోని రక్తి కట్టిస్తాడు. అయితే ఒక్కోసారి శృతి మించే పంచ్‌లు నవ్వు తెప్పించకపోగా ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి. తాజాగా హైపర్‌ ఆది మరోసారి తన డబుల్‌ మీనింగ్‌ డైలాగులతో యాంకర్‌పై రెచ్చిపోయాడు. ఓ షోలో పాల్గొన్న హైపర్‌ ఆది..యాంకర్‌ వర్షపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ అవుతున్నాయి. 

హైపర్‌ ఆది-వర్షకు మధ్య జరిగిన ఓ డిస్కషన్‌లో ఎలా ఉన్నావు అని ఆది అడగ్గా...బావున్నానండీ. ఎందుకంటే నా పని నేను చూసుకుంటాను కాబట్టి అని వర్ష చెప్పింది. దీనికి  కౌంటర్‌గా... 'అదే పనిగా నీకు వచ్చే కామెంట్లు చూసుకుపోయావా..షోలో  కొత్తగా వచ్చిన లేడీ గెటప్‌ ఎవరు అని చాలామంది అడుగుతున్నారు' అంటూ వర్షపై బాడీషేమింగ్‌ వ్యాఖ్యలు చేశాడు. ఆమె జెండర్‌పై ఆది చేసిన ఈ వల్గర్‌ కామెంట్స్‌  ప్రస్తుతం సోషల్‌ మీడియాలో దుమారం రేపుతున్నాయి. లేడీ యాంకర్ల పరువు తీసేలా ఆది బిహేవ్‌ చేస్తున్నాడంటూ నెటిజన్లు ఫైర్‌ అవుతున్నారు. 

చదవండి : ప్రేమలో ఉన్నా.. సురేఖ వాణి షాకింగ్‌ పోస్ట్‌
జాతిరత్నాలు డైరెక్టర్‌కు కాస్ట్‌లీ లంబోర్గిని కారు!

Advertisement
 
Advertisement
Advertisement