Actress Hina Khan Tests Positive For Covid-19, Says I Have Home Quarantined,All I Need Is Yours Prayers - Sakshi
Sakshi News home page

నా కుటుంబానికి ఇది అత్యంత కష్ట సమయం : హీనా ఖాన్‌

Apr 27 2021 12:12 PM | Updated on Apr 27 2021 12:45 PM

Hina Khan tests positive for Covid-19, in home quarantine - Sakshi

తండ్రి మరణించి వారం రోజులు కూడా గడవక ముందే నటి హీనా ఖాన్‌ కుటుంబంలో మరో విషాదం..మీ అందరి ప్రార్థనలు ఇప్పుడు ఎంతో అవరమంటూ నటి ట్వీట్‌

ముంబై : హిందీ టెలివిజన్‌ నటి హీనా ఖాన్ కుటుంబంలో మరో విషాదం చోటుచేసుకుంది. గత వారం క్రితమే గుండెపోటుతో ఆమె తండ్రి కన్నుమూసిన సంగతి తెలిసిందే. తాజాగా హీనా ఖాన్‌కు కరోనా పాజిటివ్‌ అని నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌ ద్వారా వెల్లడించింది. నాకు, నా కుటుంబ సభ్యులకు ఇది అత్యంత కష్టతరమైన సమయం. ఇలాంటి టైంలో నాకు కరోనా వచ్చిందని తేలింది. ఇంట్లోనే హాం క్వారంటైన్‌లో డాక్టర్ల సలహా మేరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తున్నాను. గత కొన్ని రోజులుగా నన్ను కలిసిన వారంతా కరోనా పరీక్షలు చేయించుకోండి. ఇప్పుడు నాకు మీ అందరి ప్రార్థనలు ఎంతో అవసరం అంటూ పోస్ట్‌ చేసింది. ఇక తండ్రి మరణంతో కొన్ని రోజుల పాట సోషల్‌ మీడియాకు దూరంగా ఉన్న హీనా ఖాన్‌..తాజాగా ఈ కష్ట సమయంలో తనకు, తన కుటుంబానికి తోడుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపింది. 

ఇక ఇక ‘యే రిష్‌తా క్యా కెహ్లాతా హై’ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు హీనా ఖాన్‌. తొలి సీరియల్‌తోనే హీనా ఖాన్‌కు స్టార్‌ ఇమేజ్‌ దక్కింది. ఈ సీరియల్‌లో అక్షర పాత్రతో ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తర్వాత బిగ్‌బాస్‌ షోతో మరింత ప్రచారం పొందారు‌. బిగ్‌బాస్‌11 సీజన్‌లో పాల్గొని రన్నరప్‌ నిలిచి సత్తా చాటారు. ఇక హీనా ఖాన్‌ నటించిన తొలి చిత్రం లైన్స్‌..కేన్స్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించిన సంగతి తెలిసిందే. 

చదవండి : తండ్రి మరణంతో ముంబైకు చేరుకున్న హీనా ఖాన్‌
సీనియర్‌ నటి భర్త, ప్రముఖ నిర్మాత మృతి 


 

Advertisement
 
Advertisement
Advertisement