Hero Tarun To Re Entry With Mahesh Babu SSMB28 Movie | Trivikram - Sakshi
Sakshi News home page

Hero Tarun-Mahesh Babu: ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్న తరుణ్‌!

Aug 29 2022 1:33 PM | Updated on Aug 29 2022 3:06 PM

Hero Tarun To Re Entry With Mahesh Babu SSMB28 Movie - Sakshi

మహేశ్‌ బాబు-  త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో SSMB28 అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.అతడు, ఖలేజాల వంటి చిత్రాల వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుండటంతో ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌ రూపొందిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో ప్రారంభం కానుంది.

ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర వార్త నెట్టింట చక్కర్లు కొడుతుంది. సాధారణంగా త్రివిక్రమ్‌ తన సినిమాల్లో ఓ ముఖ్యమైన పాత్ర కోసం సీనియర్‌ హీరోలు, హీరోయిన్స్‌ని తీసుకుంటాడు. తాజాగా SSMB28 సినిమా కోసం లవర్‌ బాయ్‌ తరుణ్‌ని తీసుకోనున్నట్లు టాక్‌ వినిపిస్తుంది. వరుస పరాజయాలతో కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరమయిన తరుణ్‌ మళ్లీ ఈ సినిమాతో రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

కాగా తరుణ్‌ హీరోగా నటించిన నువ్వే నువ్వే మూవీతోనే త్రివిక్రమ్‌ డైరెక్టర్‌గా కెరీర్‌ ప్రారంభించగా మళ్లీ ఇన్నాళ్లకు ఆయన దర్శకత్వంలో తరుణ్‌ కనిపించనున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 
 

Advertisement
 
Advertisement
Advertisement