'రామబాణం'తో వస్తున్న గోపీచంద్.. ఆకట్టుకుంటున్న ఫస్ట్ లుక్ | Gopichand Latest Movie RamaBanam First Look Video Out | Sakshi
Sakshi News home page

Ramabanam Movie: 'రామబాణం'.. అదిరిపోయిన గోపీచంద్ ఫస్ట్ లుక్

Feb 18 2023 8:14 PM | Updated on Feb 18 2023 8:24 PM

Gopichand Latest Movie RamaBanam First Look Video Out - Sakshi

మాచో స్టార్ గోపీచంద్, హీరోయిన్ డింపుల్ హయాతి జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'రామబాణం'. 'లక్ష్యం', 'లౌక్యం' చిత్రాల తర్వాత  శ్రీవాస్‌ డైరెక్షన్‌లో తెరకెక్కిస్తున్న హ్యాట్రిక్ సినిమా. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో జగపతి బాబు, కుష్బూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది. మహాశివరాత్రి సందర్బంగా గోపీచంద్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. విక్కీ అనే పవర్‌ఫుల్ పాత్రలో గోపీచంద్ లుక్‌ ఆకట్టుకుంటోంది. 'విక్కీస్ ఫస్ట్ యారో' పేరుతో విడుదల చేసిన ప్రత్యేక వీడియో అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.

రామబాణంలో విక్కీ అనే పవర్ ఫుల్ పాత్రలో గోపీచంద్ కనిపించనున్నారు. ఈ వీడియో చూస్తే ఫుల్ యాక్షన్‌ సినిమాగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైట్స్‌ చూస్తే పూర్తి యాక్షన్‌ను తలపిస్తున్నాయి. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు బలమైన కథాంశంగా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. గత చిత్రాలతో పోలిస్తే ఈ సినిమాలో సరికొత్త గోపీచంద్‌ను చూడబోతున్నామని అర్థమవుతోంది.

విక్కీస్ ఫస్ట్ యారో వీడియో ప్రేక్షకుల్లో అంచనాలను భారీ అంచనాలను పెంచుతోంది. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్  సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాలో సచిన్ ఖేడ్ ఖర్, నాజర్, ఆలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2023 వేసవి కానుకగా విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement