వినోదం..సందేశం | Dumaram movie shooting started. | Sakshi
Sakshi News home page

వినోదం..సందేశం

Aug 12 2023 6:18 AM | Updated on Aug 12 2023 6:18 AM

Dumaram movie shooting started. - Sakshi

మల్లిక్‌ బాబు, వినయ్, ఇషా, ప్రియాన్స్‌ హీరో హీరోయన్లుగా, సుమన్‌ కీలక పాత్రలో నటిస్తున్న సినిమా ‘దుమారం‘. జీఎల్బీ శ్రీనివాస్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.  సుమన్‌ మాట్లాడుతూ– ‘‘నాయీ బ్రాహ్మణుల వృత్తి, వారు జీవితంలో పడుతున్న ఇబ్బందులను కమర్షియల్‌ ఫార్మాట్‌లో ఈ సినిమాలో చూపిస్తున్నాం.

ఇందులో బార్బర్‌గా చేస్తున్నా. వినోదం, సందేశం అన్నీ ఉన్న చిత్రం అన్నారు. ‘‘హీరో తండ్రి పాత్రను  సుమన్‌ చేస్తున్నారు’’ అన్నారు జీఎల్బీ శ్రీనివాస్‌. ‘‘తొలి చిత్రంలోనే మాస్‌ క్యారెక్టర్‌ దొరకడం హ్యాపీ’’ అన్నారు మల్లిక్‌. ‘‘ఈ సినిమా కో ప్రొడ్యూసర్‌గా చేస్తూనే, విలన్‌ కొడుకు పాత్ర చేస్తున్నా’’ అన్నారు పాండు గౌడ్‌.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement