సూపర్‌ మచ్చి మూవీ నుంచి లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌

Dinchaku Dinchaku Song From Super Machi Released - Sakshi

Dinchaku Dinchaku Song From Super Machi Released: పులివాసు దర్శకత్వంలో మెగా హీరో కల్యాణ్‌ దేవ్‌ నటించిన చిత్రం సూపర్‌ మచ్చి. లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకుగా ఈనెల 14న విడుదల కానుంది. ప్రమోషన్స్‌ జోరు పెంచిన చిత్ర బృందం తాజాగా ఈ చిత్రం నుంచి డించక్‌ డించక్‌ అనే లిరికల్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్‌ అందించిన ఈ సాంగ్‌ని సాకేత్‌ ఆలపించాడు.


తమన్‌ సంగీతం ఆకట్టుకుంటుంది. రిజ్వాన్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై రిజ్వాన్, ఖుషి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఇక ఈ సినిమాలో కల్యాణ్‌ దేవ్‌కు జోడిగా కన్నడ నటి రచితా రామ్ నటిస్తోంది. రాజేంద్రప్రసాద్, నరేశ్‌, ప్రగతి, పోసాని కృష్ణమురళి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top