యముడు: ధర్మో రక్షతి రక్షిత: పాట రిలీజ్‌ | Dharmo Rakshati Rakshitah Song Released from Yamudu Movie | Sakshi
Sakshi News home page

Yamudu Movie: ధర్మో రక్షతి రక్షిత:.. అంటూ సాగే పవర్‌ఫుల్‌ సాంగ్‌ రిలీజ్‌

Jun 14 2025 7:24 PM | Updated on Jun 14 2025 7:24 PM

Dharmo Rakshati Rakshitah Song Released from Yamudu Movie

మైథలాజికల్, సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్‌గా ‘యముడు’ అనే చిత్రం రాబోతోంది. జగన్నాధ పిక్చర్స్ పతాకంపై జగదీష్ ఆమంచి హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాకు 'ధర్మో రక్షతి రక్షితః' అనేది ఉప శీర్షిక. ఈ చిత్రంలో శ్రావణి శెట్టి హీరోయిన్‌గా నటించారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్, టీజర్ ఇలా అన్నీ కూడా సినిమా మీద అంచనాల్ని పెంచేసింది.

తాజాగా ఈ చిత్రం నుంచి ‘ధర్మో రక్షతి’ అంటూ సాగే ఓ అద్భుతమైన పాటను రిలీజ్ చేశారు. ఈ పాటకు వంశీ సరోజిని వికాస్ సాహిత్యాన్ని అందించగా.. సాయి చరణ్ భాస్కరుణి, అరుణ్ కౌండిన్య, హర్ష వర్దన్ చావలి ఆలపించారు.  భవానీ రాకేష్ అందించిన బాణీ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉంది. అన్ని కార్యక్రమాల్ని పూర్తి చేసుకున్న ‘యముడు’ రిలీజ్ డేట్‌ను త్వరలోనే ప్రకటించనున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement