'డెడ్‌పుల్ అండ్ వాల్వ‌రిన్' సినిమాకు భారీ కలెక్షన్స్‌ | Deadpool And Wolverine 3 Days Collection | Sakshi
Sakshi News home page

'డెడ్‌పుల్ అండ్ వాల్వ‌రిన్' సినిమాకు భారీ కలెక్షన్స్‌

Jul 29 2024 2:53 PM | Updated on Jul 29 2024 3:15 PM

Deadpool And Wolverine 3 Days Collection

హాలీవుడ్ సూప‌ర్ హీరో సినిమా 'డెడ్‌పుల్ అండ్ వాల్వ‌రిన్' బాక్సాఫీస్‌ వద్ద భారీ కలెక్షన్లతో దుమ్మురేపుతుంది. కేవలం మూడు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 3650 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి రికార్డ్‌ క్రియేట్‌ చేసిన చిత్రంగా నిలిచింది. భారత్‌లో కూడా ఇప్పటి వరకు రూ. 65 కోట్లకు పైగానే క‌లెక్ష‌న్స్ రాబట్టింది. అయితే ఈ సినిమా నిర్మాణం కోసం రూ. 1675 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

డెడ్‌పుల్‌, డెడ్‌పుల్ 2 సినిమాల‌కు సీక్వెల్‌గా 'డెడ్‌పుల్ అండ్ వాల్వ‌రిన్' జులై 26న విడుదలైంది. సూప‌ర్ బ్లాక్ బ‌స్ట‌ర్ టాక్‌తో విజ‌యవంతంగా  తెలుగునాట థియేట‌ర్లలో సందడి చేస్తుంది.  మార్వెల్ స్టూడియోస్ వారు నిర్మించిన ఈ సినిమాలో ర‌య‌న్ రెనాల్డ్స్, హుయ్ జాక్ మెన్ ముఖ్య పాత్ర‌లలో నటించారు. ఈ సినిమా విడుద‌లైన మూడు రోజుల్లోనే ప్ర‌పంచ మూవీ బాక్స్ ఫీస్‌ని షేక్ చేస్తుంది.

దాదాపుగా మూడు రోజుల్లో రూ. 3650 కోట్లు క‌లెక్ట్ చేసి కాసుల వ‌ర‌ద సృష్టించింది. ఇండియాలో కూడా డెడ్ పుల్ అండ్ వాల్విరిన్ క‌లెక్ష‌న్ల హ‌వా కొన‌సాగుతుంది. మరీ ముఖ్యంగా తెలుగులో ఈ సినిమాకు మార్వెల్ మూవీ అభిమానుల అద‌ర‌ణ ద‌క్కింది. తెలుగు డ‌బ్బింగ్ వెర్ష‌న్ లో ఉన్న టైమ్లీ డైలాగులు అభిమానుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. డెడ్ పుల్ పాత్ర‌దారు ర‌య‌న్ రెనాల్డ్స్ ప‌లికిన ప్ర‌తి సంభాష‌ణ‌కి సంబంధించిన తెలుగు డ‌బ్బింగ్ ఆద్యంతం హాస్యాన్ని పండించింది. దీంతో  ఈ సినిమాకు విడుద‌లైన రోజు నుంచి తెలుగులో విశేషాద‌ర‌ణ ల‌భిస్తుంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement