Choreographer Aata Sandeep Bought Luxurious House In Hyderabad, Video Goes Viral - Sakshi
Sakshi News home page

Aata Sandeep: ఐదేళ్లు కష్టపడ్డాం.. కల నెరవేరింది: ఆట సందీప్

Jan 20 2023 5:38 PM | Updated on Jan 20 2023 5:48 PM

A choreographer Aata Sandeep bought a luxurious house In Hyderabad - Sakshi

టాలీవుడ్‌లో ప్రముఖ కొరియోగ్రాఫర్‌ ఆట సందీప్‌ పేరు తెలియనివారు ఉండరు. తాజాగా ఆయన హైదరాబాద్‌లో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు. ప్రముఖ డ్యాన్స్‌ రియాలిటీ షో 'ఆట' ద్వారా ఫేమ్ సంపాదించారు. అందువల్లే అతని పేరుతోనే ఆట సందీప్‌గా అభిమానుల్లో ముద్ర వేసుకున్నారు. 

ఇటీవలే ఇంటి రిజిస్ట్రేషన్‌ కూడా పూర్తయినట్లు సందీప్ తెలిపారు. అయితే కొవిడ్ తర్వాత చాలా ఇబ్బందులు పడినట్లు వారు తెలిపారు. ఇది తమ ఐదేళ్ల కష్టానికి దక్కిన ఫలితమని సంతోషం వ్యక్తం చేశారు. కరోనా టైంలో పడిన కష్టాలను వివరిస్తూ తన ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు.  దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు ఆట సందీప్, జ్యోతిరాజ్.  ప్రముఖ డ్యాన్స్‌ రియాలిటీ షో 'ఆట' మొదటి సీజన్‌లోనే విన్నర్‌గా నిలిచారు సందీప్.  

Advertisement
 
Advertisement
Advertisement