ఓటీటీలో మలయాళ థ్రిల్లింగ్‌ సినిమా.. తెలుగు వర్షన్‌ స్ట్రీమింగ్‌ | Chapra Murder Case Movie OTT Release Date Locked, Check Streaming Platform Details Inside | Sakshi
Sakshi News home page

ఓటీటీలో మలయాళ థ్రిల్లింగ్‌ సినిమా.. తెలుగు వర్షన్‌ స్ట్రీమింగ్‌

Sep 24 2024 7:31 AM | Updated on Sep 24 2024 9:36 AM

Chapra Murder Case Movie OTT Streaming Date Locked

మలయాళ హిట్‌ సినిమా 'అంచక్కల్లకోక్కన్' ఇప్పుడు 'చాప్రా మర్డర్ కేస్' పేరుతో తెలుగులో విడుదల కానుంది. అది కూడా ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రంగా సూపర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకున్న ఈ చిత్రం ఈ ఏడాది మార్చి 15న థియేటర్స్‌లోకి వచ్చింది. ఈ మూవీని చూసిన ప్రేక్షకులు ప్రశంసలు కురిపించారు. బాక్సాఫీస్‌ వద్ద కూడా మంచి కలెక్షన్సే రాబట్టింది.

'చాప్రా మర్డర్ కేస్' పేరుతో తెలుగు ఓటీటీ 'ఆహా'లో విడుదల కానుంది. సెప్టెంబర్‌ 25 నుంచి స్ట్రీమింగ్‌ అవుతుందని ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వెలువడింది. అయితే, ఈ సినిమా మలయాళ ఒరిజినల్‌ వర్షన్‌ 'అంచక్కల్లకోక్కన్' అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఈ చిత్రంలో లుక్‍మన్ అవరన్, చెంబన్ వినోద్ జోస్ ప్రధాన పాత్రలలో మెప్పించారు. ఉల్లాస్ చంబన్ దీనిని అద్భుతంగా తెరకెక్కించారు. 

చాప్రా మర్డర్ కేస్ కథ  1980ల బ్యాక్‍డ్రాప్‍లో ఉంటుంది. కేరళ - కర్ణాటక సరిహద్దులో ఉండే ఒక గ్రామంలో ఈ స్టోరీ నడుస్తుంది. తన తండ్రిని చంపిన వారిపై కుమారులు ఎలా రివేంజ్‌ తీర్చుకున్నారు   అనే అంశాన్ని చాలా థ్రిల్లింగ్‌గా దర్శకుడు చెప్పారు. 

Advertisement
 
Advertisement
Advertisement