
రజనీకాంత్ హీరోగా పి. వాసు దర్శకత్వం వహించిన ‘చంద్రముఖి’ (2005)కి సీక్వెల్‌గా తెరకెక్కించిన సినిమా ‘చంద్రముఖి 2’. రాఘవ లారెన్స్ హీరోగా నటించిన ఈ చిత్రంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్ర పోషించారు. పి.వాసు దర్శకుడు. సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాని వినాయక చవితికి (సెప్టెంబరు) విడుదల చేయనున్నట్లు ప్రకటించి, రాఘవ లారెన్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ ను గమనిస్తే... రాజు వేషంలో రాఘవ లారెన్స్ కనిపిస్తున్నారు. ఆ లుక్ లో పొగరు, రాజసంతో పాటు కూర్రత్వం కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. లుక్‌లోనే ఈ రేంజ్ ఉంటే సినిమాలో లారెన్స్ ఎలా తనదైన నటనతో ఆకట్టుకుంటారనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోన్న అంశం. వడివేలు, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రాధికా శరత్‌కుమార్ నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.కీరవాణి సంగీత సారథ్యం వహిస్తున్నారు.