చంద్రముఖిగా మారనున్న కంగనా రనౌత్‌! | Sakshi
Sakshi News home page

Chandramukhi 2: చంద్రముఖిగా మారనున్న కంగనా రనౌత్‌!

Published Wed, Nov 30 2022 9:17 AM

Chandramukhi 2: Kangana Ranaut To Play Chandramukhi Role - Sakshi

వెండితెరపై లేటెస్ట్‌ చంద్రముఖిగా కనిపించనున్నారు కంగనా రనౌత్‌. రజనీకాంత్, జ్యోతిక, ప్రభు, నయనతార ప్రధాన పాత్రల్లో పి. వాసు దర్శకత్వంలో 2005లో వచి్చన ‘చంద్రముఖి’ ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘చంద్రముఖి 2’ను తెరకెక్కిస్తున్నారు పి. వాసు. అయితే లీడ్‌ రోల్‌ను రాఘవా లారెన్స్‌ చేస్తున్నారు.

కాగా అప్పటి ‘చంద్రముఖి’లో జ్యోతిక చేసిన చంద్రముఖి పాత్రకు సీక్వెల్‌లో కంగనాను  తీసుకున్నారని తెలిసింది. ‘దర్శకులు పి. వాసుగారితో వర్క్‌ చేయనుండటం హ్యాపీగా ఉంది’ అని పేర్కొన్నారు కంగనా రనౌత్‌. డిసెంబరు తొలి వారంలో చెన్నైలో జరగనున్న ‘చంద్రముఖి 2’ చిత్రీకరణలో కంగనా పాల్గొంటారని టాక్‌.

Advertisement
 
Advertisement
 
Advertisement