ఇండస్ట్రీలో ఆ తేడా లేదు: బ్రహ్మానందం | Brahmanandam Comments In Cheddi Gang Tamasha Movie Trailer Event | Sakshi
Sakshi News home page

Brahmanandam: ఇండస్ట్రీలో ఆ తేడా లేదు: బ్రహ్మానందం

Dec 19 2022 8:47 AM | Updated on Dec 19 2022 8:50 AM

Brahmanandam Comments In Cheddi Gang Tamasha Movie Trailer Event - Sakshi

‘‘చిత్ర పరిశ్రమలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనే తేడా లేదు. ఓ మూవీ కోసం అందరూ ఎంతో కష్టపడి పనిచేస్తారు. సినిమా బాగుంటే అదే హిట్‌ అవుతుంది’’ అని నటులు బ్రహ్మానందం అన్నారు. వెంకట్‌ కల్యాణ్‌ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘చెడ్డీ గ్యాంగ్‌ తమాషా’. గాయత్రీ పటేల్‌ హీరోయిన్‌. అబుజా, శ్రీలీల ఎంటర్‌టైన్మెంట్స్‌పై సీహెచ్‌ క్రాంతి కిరణ్‌ నిర్మించిన ఈ సినిమా ట్రైలర్‌ని బ్రహ్మానందం ఆదివారం విడుదల చేశారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ..‘‘హాస్య నటులు తీసే సినిమాలన్నీ సక్సెస్‌ కావాలని, హాస్యం బయటకు రావాలని మా గురువు జంధ్యాలగారు చెప్పేవారు.  హాస్యాన్ని బతికించాలని కామెడీ నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ వేడుకకి వచ్చాను’’ అన్నారు. ‘‘నిర్మాతలు రైతుల్లాంటి వాళ్లు.. ప్రేక్షకులకు వినోదాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాం. ఈ మూవీ రెండో భాగం ఉంటుంది.. అన్నీ కుదిరితే బ్రహ్మానందంగారు నటిస్తారు’’ అన్నారు సీహెచ్‌ క్రాంతి కిరణ్‌. ‘‘పూర్తి కామెడీ డ్రామాగా రూపొందిన సినిమా ఇది’’ అన్నారు వెంకట్‌ కల్యాణ్‌. ఈ చిత్రానికి కెమెరా: జీకే యాదవ్‌ బంక, సంగీతం: అర్జున్‌ నల్లగొప్పుల. 

Advertisement
 
Advertisement
Advertisement